పవన్ క్యాంప్ నుంచి విజయ్ కు ఫోన్

యంగ్ స్టార్ కు పవర్ స్టార్ నుంచి ఫోన్ అంటే కాస్త ఆసక్తే కదా. ఎవడే సుబ్రహ్యణ్యం సినిమాతో జనాలను ఆకట్టకుని, పెళ్లి చూపులు సినిమాతో ఫుల్ గా క్రేజ్ తెచ్చేసుకున్నాడు దేవరకొండ విజయ్. చేతిలో ఇంకో రెండు సినిమాలతో బిజీగా వున్నాడు. ఇతగాడికి పవన్ కళ్యాణ్ క్యాంప్ నుంచి ఫోన్ వచ్చింది. 

నిర్మాత, పవన్ సన్నిహితుడు శరద్ మురార్ కాల్ చేసి, చాలా బాగా చేసారు అని అభినందించడమే కాకుండా, త్వరలో ఓసారి కలుద్దామని, ఆఫీస్ కు ఆహ్వానించారు. అంటే దీని వెనుక వైనమేమిటి? అన్న ఆసక్తి ఇండస్ట్రీలో కనిపిస్తోంది. పవన్ చేయబోయే సినిమాలో ఒకటి రెండు యంగ్ హీరో ల క్యారెక్టర్లు వున్నాయని, వాటిలో ఒకదాని కోసమే అడిగారని ఒక టాక్. 

లేదు పవన్ స్వయంగా అభినందించే ఉద్దేశంతో కబురుచేసారో మరి. మొత్తానికి కుర్రాడిపై టాలీవుడ్ ఫోకస్ పడుతోంది.

Readmore!
Show comments

Related Stories :