జీవితంలో పెళ్లి చేసుకోను.. వదిలేయండి ప్లీజ్

పెళ్లి కంటే కెరీర్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. క్రేజ్ తీసుకొచ్చే గ్లామర్ ప్రపంచం కంటే భరతనాట్యమే ఎక్కువనుకుంది. అందుకే సినిమాలు కూడా వదులుకుంది.

అలా 2 దశాబ్దాలుగా నాట్య ప్రదర్శనలకే పరిమితమైన శోభన, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు వచ్చాయి. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక ఈ వార్తను ప్రముఖంగా ప్రకటించడంతో ఒక్కసారిగా శోభన హెడ్ లైన్స్ లోకి ఎక్కేసింది.

47 ఏళ్ల శోభన త్వరలోనే పెళ్లి చేసుకోనుందని ఆ వార్తాపత్రిక రాసుకొచ్చింది. కొన్నేళ్లుగా పరిచయం ఉన్న ఓ స్నేహితుడ్నే ఆమె తన జీవిత భాగస్వామిగా ఎన్నుకుందని వార్తలు వచ్చాయి. దీనికి శోభన స్పందించింది. అయితే దీనిపై శోభన స్పందించింది. తను ఎవర్నీ పెళ్లి చేసుకోనని స్పష్టంచేసింది.

పెళ్లి చేసుకోకూడదనే ఉద్దేశంతో 2001లోనే ఓ పాపను దత్తత తీసుకుంది శోభన. అనంత నారాయణి అనే పేరుపెట్టి ఆ పాపను పెంచుకుంటోంది. ఓవైపు పాపను చూసుకుంటూనే మరోవైపు నాట్య ప్రదర్శనలు కొనసాగిస్తోంది.

ఇలాంటి టైమ్ లో శోభన వ్యక్తిగత జీవితంపై అకస్మాత్తుగా వార్తలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే వీటిని శోభన తేలిగ్గా తీసుకున్నారు. పదేళ్లుగా ఇలాంటి వార్తలకు తను అలవాటు పడిపోయానని అంటోంది శోభన.

Show comments