ఇంతకీ ఆ ముద్దుల్లో ఏముందంటే.!

పహ్లాజ్‌ నిహ్లానీ.. అత్యంత వివాదాస్పద వ్యక్తి.. సెన్సార్‌ బోర్డ్‌ ఛైర్మన్‌గా గతంలో పనిచేసినవారెవరిమీదా లేనన్ని అభియోగాలు ఈయనగారిమీద వున్నాయి. 'ఉడతా పంజాబ్‌' విషయంలో పహ్లాజ్‌ నిహ్లానీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా సినిమాలకు సంబంధించి పహ్లాజ్‌ నిహ్లాన్నీ 'సర్టిఫికెట్లు' ఇచ్చే తీరు వివాదాస్పదమవుతూ వస్తోంది. డబ్బులు తీసుకుంటాడా.? ఇంకేమైనా రూపాల్లో 'ఆమ్యామ్యా' తింటాడా.? అన్నది ఎవరికీ అంతుబట్టడంలేదు. దక్కిన పదవిని భ్రష్టు పట్టించేయడంలో పహ్లాజ్‌ నిహ్లానీ తర్వాతే ఎవరైనా.. అనే స్థాయిలో ఆయన విమర్శల్ని ఎదుర్కొంటున్నాడు. 

తాజాగా, 'బేఫికర్‌' సినిమా విషయంలో పహ్లాజ్‌ నిహ్లానీపై వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాలో 40కి పైగా లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్స్‌ వున్నాయి. చిత్రంగా, దేనికీ కటింగ్స్‌ ఇవ్వలేదు. మామూలుగా అయితే ఓ సినిమాలో లిప్‌ టు లిప్‌ కిస్‌ సీన్‌ వుందంటే, దాని నిడివిని తగ్గించేయడమో, పూర్తిగా లేపెయ్యడమో జరుగుతుంది. నిడివి తగ్గించడమంటేనే, తెరవెనుక మతలబులు చాలా జరగాలి. 

అలాంటిది, 'బేఫికర్‌' సినిమా విషయంలో అలాంటిదేమీ జరగకపోవడం ఆశ్చర్యకరమే. ఇప్పటికే ఈ వ్యవహారంపై స్పందించిన పహ్లాజ్‌ నిహ్లానీ, ఆ ముద్దులు 'శృంగార భావనల్ని కలగజేయవు' అని వివరణ ఇచ్చారనుకోండి.. అది వేరే విషయం. అయినాసరే వివాదం సద్దుమణగలేదు. దాంతో, తాజాగా మరోసారి పెదవి విప్పాడు పహ్లాజ్‌ నిహ్లానీ. ఈసారి, ఆయన కామెంట్స్‌ని వింటే షాక్‌కి గురవ్వాల్సిందే. 

'ప్రపంచం మారుతోంది.. ఇండియాలో లిప్‌ టు లిప్‌ కీస్‌ అసభ్యత.. అదో పాపం. అదే, ప్యారిస్‌లో అయితే చాలా సాధారణమైన విషయం. 'బేఫికర్‌'లో ప్రపంచ వ్యాప్తంగా వున్న యూత్‌ మనోభావాల్ని చూపించారు.. దాంతో ఆ లిప్‌ కిస్‌ సన్నివేశాల్ని కట్‌ చేయడంలో అర్థం లేదనే నిర్ణయానికి వచ్చాం. నాకెక్కడా అందులో అసభ్యత కన్పించలేదు..' అని సెలవిచ్చాడు పహ్లాజ్‌ నిహ్లానీ. ఇంకేం, జంతువులు కూడా బట్టల్లేకుండానే తిరుగుతాయి.. నడిరోడ్ల మీదనే 'సంబోగం' జరిపేసుకుంటాయి.. సో, వాటితో పోల్చి, బాలీవుడ్‌ సినిమాల్లోనూ పోర్న్‌ కంటెంట్‌కి అనుమతిచ్చేయొచ్చు కదా.!

ముద్దు సీన్లు ఇంతకుముందు కూడా బాలీవుడ్ సినిమాల్లో కనిపించాయి.. కానీ, ముద్దు సీన్లకు సంబంధించి సెన్సార్ బోర్డ్ ఛైర్మన్ వివాదాల్లోకి రావడం ఇంతకుముందెన్నడూ ఈ స్థాయిలో జరగలేదు.. అదే అసలు సమస్య.

Show comments