సునీల్‌ డాన్సులకి 'మెగా' సర్టిఫికెట్‌

సునీల్‌ హీరోగా 'జక్కన్న' సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఈ చిత్రంలో సునీల్‌ సరసన మనారా చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. 'జక్కన్న' సినిమా ఆడియో విడుదల వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, సినిమా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారు. 

తనను అన్నయ్యా అని ఆప్యాయంగా పిలిచే సునీల్‌ అంటే తనకెంతో ఇష్టమనీ, తెలుగు సినీ పరిశ్రమకు వున్న బెస్ట్‌ డాన్సర్లలో సునీల్‌ కూడా ఒకడని ఈ సందర్భంగా సునీల్‌ డాన్సులకి చిరంజీవి 'సర్టిఫికెట్‌' ఇచ్చేశారు. అందరికీ తెల్సిన విషయమే, చిరంజీవికి సునీల్‌ వీరాభిమాని. 'ఇంద్ర' సినిమాలోని చిరంజీవి వీణ స్టెప్‌ని వేయడమంటే సునీల్‌కి ఎంతో ఇష్టం కూడా. 

ఇక, 'జక్కన్న' గురించి సునీల్‌ మాట్లాడుతూ, ఔట్‌ అండ్‌ ఔట్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. పిలవగానే షూటింగ్‌ కాదనుకుని, తన సినిమా ఆడియో విడుదల వేడుకకు చిరంజీవి రావడం చాలా ఆనందంగా వుందన్నాడు సునీల్‌. 

Show comments