రామ్ చరణ్ కొత్త సినిమా పేరు రంగస్థలం

మొన్నటివరకు ఈ సినిమాకు రేపల్లె అనే టైటిల్ అనుకున్నారు. ఈ పేరుతో పాటు తెరపైకి చాలా టైటిల్స్ వచ్చాయి. ఫైనల్ గా రామ్ చరణ్, సుకుమార్ సినిమాకు రంగస్థలం-1985 అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రకటించారు.

సుకుమార్ టైటిల్స్ అన్నీ కాస్త డిఫరెంట్ గా ఉంటాయి. ఆర్య, జగడం, వన్-నేనొక్కడినే, హండ్రెస్ పర్సెంట్ లవ్.. ఇవన్నీ సుకుమార్ సినిమా పేర్లు. అయితే రామ్ చరణ్ సినిమా టైటిల్ వీటన్నిటికంటే ఇంకా స్పెషల్ గా అనిపిస్తోంది. రంగస్థలం అనే టైటిల్ ఎందుకు పెట్టారనేది ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది.

టైటిల్ తో ఓ విషయంపై మాత్రం క్లారిటీ ఇచ్చాడు సుకుమార్. 1985 నాటి కథతో ఈ సినిమా రాబోతుందనే విషయం స్పష్టమైంది. రంగస్థలం అనే టైటిల్ కింద 1985 అని రాశాడు.

సినిమాలో చరణ్ డిఫరెంట్ గెటప్ ట్రై చేస్తున్నాడు. ఫుల్ గా గడ్డం పెంచి, లుంగీ కట్టి, 80ల నాటి అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

Show comments