కాస్త ముందుగానే నాగచైతన్య-సమంతల పెళ్లి

అనుకున్న టైమ్ కంటే ఇంకాస్త ముందే నాగచైతన్య, సమంతల పెళ్లి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా అక్కినేని కాంపౌండ్ లో జరిగిన వ్యవహారాలతో ఈ మార్పు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి తమ్ముడు అఖిల్ పెళ్లయిన తర్వాతే తను పెళ్లి చేసుకుంటానని నాగచైతన్య గతంలో ప్రకటించాడు. కానీ అఖిల్-శ్రియ భూపాల్ ల పెళ్లి ఆల్ మోస్ట్ కాన్సిల్ అయింది. ఏదో ఊహించని ట్విస్ట్ జరిగితే తప్ప ఈ పెళ్లి దాదాపు ఆగిపోయినట్టే. ఈ మేరకు నాగార్జున అధికారికంగా ఓ ప్రకటన కూడా చేయడానికి రెడీ అవుతున్నాడట. ఈ పరిణామాల నేపథ్యంలో నాగచైతన్య-సమంతల పెళ్లి అనుకున్న టైమ్ కంటే కాస్త ముందుగానే జరగవచ్చని అంటున్నారు.

లెక్క ప్రకారం అఖిల్ పెళ్లి మే నెలలో అనుకున్నారు. ఆ తర్వాత నాగచైతన్య-సమంత పెళ్లి చేద్దామని నాగార్జున అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ కోసం అనుకున్న ముహుర్తానికే నాగచైతన్య-సమంతల వివాహం జరిపించాలని నాగ్ భావిస్తున్నాడట.

ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో నాగచైతన్య, సమంత ఇద్దరు వరుసగా సినిమాలు ఒప్పుకున్నారు. అయితే నాగార్జున కోరుకుంటే కనుక కాస్త ముందుగానే పెళ్లికి సిద్ధమవ్వాలని ఇద్దరూ భావిస్తున్నారు. ప్రస్తుతం చైతూ, సమంత ఇద్దరూ చెరో రెండేసి సినిమాలకు కాల్షీట్లు కేటాయించారు.

Readmore!

Show comments