అందరూ మరిచిపోయాకా కమల్ సినిమా విడుదలకు మోక్షం?!

‘విశ్వరూపం-2’ బహుశా ఈ పేరుతో కమల్ ఒక సినిమాను రూపొందించాడని దాదాపుగా మరిచిపోయారంతా. కమల్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కూడా ఈ సినిమా సంగతి గుర్తుకు లేకపోవచ్చు. స్వయంగా కమల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హిట్టైన, వివాదాస్పదమైన ‘విశ్వరూపం’ సినిమాకు సీక్వెల్. చుట్టుముట్టిన వివాదాలతో ‘విశ్వరూపం’ విడుదల జాప్యం అయ్యింది. దానిపై పెద్ద చర్చ నడిచింది. అయితే దానికి సీక్వెల్ గా వచ్చిన ‘విశ్వరూపం-2’ విడుదల మాత్రం ఎవ్వరికీ పట్టకుండా పోయింది.

భారీ బడ్జెట్ పెట్టి రూపొందించిన ఈ సినిమా విడుదల ఆగిపోవడానికి కారణం ఆస్కార్ రవిచంద్రన్ అని ఇదివరకే కమల్ ప్రకటించాడు. దాని విడుదలతో తనకేం సంబంధం లేనట్టుగా తన సినిమాలను తాను చేసుకొంటూ వెళ్లిపోతున్నాడు విశ్వనాయకుడు. మరి ఇప్పుడు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విశ్వరూపం రెండో పార్ట్ విడుదలకు ప్రయత్నాలు జరుగుతుండటం. 

‘ఐ’ సినిమాను నిర్మించి నిండా నష్టాల్లో మునిగిపోయిన రవిచంద్రన్ కొంచెం కోలుకుని ‘విశ్వరూపం-2’ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నాడు. కనీసం ఈ ఏడాది దీపావళి కన్నా ఈ సినిమాను విడుదల చేయాలని ఈ నిర్మాత ప్రయత్నిస్తున్నాడని సమాచారం. మరి అది సాధ్యం అవుతుందో లేదో చూడాల్సి ఉంది.

అయితే ఈ నిర్మాత పేరు వింటేనే కమల్ హాసన్ మండి పడుతున్నాడు. మరి అలాంటి ఈ హీరో ఈ సినిమా ప్రచారం విషయంలో సహకారం అందిస్తాడా లేదా అనేది కూడా ఆసక్తికరమైన అంశమే. Readmore!

Show comments

Related Stories :