వైవిధ్యమైన సినిమాలు వస్తే జనం ఆదరిస్తారు అన్నది వాస్తవమే అయినా, ఒక్కోసారి విడుదల టైమ్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. అక్టోబర్ ఫస్ట్ వీక్ లో తన సినిమాను విడుదల చేస్తా అంటున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. మన వూరి రామాయణం అనే చిన్న వైవిధ్యమైన సినిమా రూపొందించాడు ఆయన. ఎంత చిన్న సినిమా అయినా కనీసం కోటి నుంచి కోటిన్నర ఖర్చయితే తప్పదుగా. అలాంటి సినిమాను ఇలాంటి టైమ్ లో ఎందుకు వదుల్తున్నట్లో?
ఎందుకంటే ఫస్ట్ వీక్ లో ప్రేమమ్, వీడు గోల్డ్ ఎహె, జాగ్వార్ లాంటి మూడు సినిమాలు వున్నాయి. వీటిలో ప్రేమమ్ ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ. వీడుగోల్డ్ ఎహె అవుట్ అండ్ అవుట్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్. ఇక రెగ్యులర్ ఫార్మాట్ భారీ సినిమా జాగ్వార్. మరి ఇలాంటి మూడు సినిమాల మధ్య ఈ చిన్న సినిమా విడుదల అవసరమా?
పైగా ఆ ముందు వారమే రామ్ సినిమా హైపర్ విడుదలవుతోంది. ఆ ముందువారం రెండు సినిమాలు వున్నాయి. అవి కూడా ప్రామిసింగ్ సినిమాలే. అంటే దాదాపు ఆరు సినిమాలు దసరా నాటికి థియేటర్లలో వుండే పరిస్థితి. అలాంటపుడు ప్రకాష్ రాజ్ సినిమా కూడా అవసరమా? కాస్త మంచి టైమ్ చూసి వదిల్తే, జనాలకు రీచ్ అయ్యే అవకాశం వుంటుంది కదా?