వామ్మో.. కత్తి కేథరిన్

ఇద్దరు అమ్మాయిలతో సినిమాతో టాలీవుడ్ లోకి వస్తూనే, చిట్టి పోట్టి డ్రెస్ లతో తెగ ఊరించేసింది కేథరిన్. ఆ తరువాత పెద్దగా సినిమాలు చేయలేదు. సరైనోడు సినిమాలో నిండైన చీరకట్టుతూ కనిపించి, ఓహో, ఈ అమ్మడిలో ఈ కళ కూడా వుందా అనిపించుకుంది. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా జయ జానకీ నాయక సినిమాలో అయిటమ్ సాంగ్ చేసేసింది. 

అయిటమ్ సాంగ్ అంటే మళ్లీ అలాంటి ఇలాంటి అయిటమ్ కాదు. వీర లెవల్లో విరగదీసేసింది. ఎ ఫర్ ఏపిలు, బి ఫర్ బుజ్జులు, సి ఫర్ సిలకలు, డి ఫర్ డింపులు అంటే సాగే మాస్ బీట్ అయిటమ్ సాంగ్ లో కేథరిన్ చేసిన డ్యాన్స్ లు, ఆ డ్రెస్ లు, మొత్తంగా అయిటమ్ సాంగ్ కు ఒక్కశాతం కూడా తగ్గకుండా న్యాయం చేసేసింది. దర్శకుడు బోయపాటి కూడా కేథరిన్ ను రకరకాల డ్రెస్ ల్లో చూపిస్తూ, ఆమె నుంచి ఎంత రాబట్టుకోవాలో అంతా రాబట్టేసుకున్నాడు. 

కేథరిన్ ఇకపై ఓకె అనాలే కానీ మన జనాలు బాగానే అయిటమ్ లు చేయించేస్తారు. అది మాత్రం గ్యారంటీ. కానీ కేథరిన్ అందరు హీరోయిన్ల టైపు కాదు. తను అదోరకం. అందువల్ల మరిన్ని కేథరిన్ అయిటమ్ లు వస్తాయా అన్నది అనుమానమే. 

Show comments