మనకిక ట్రంప్ ని తిట్టే అర్హత ఉందా?

ఈ మధ్యనే భారత పార్లమెంటులో కొంతమంది ఎంపీలు రెచ్చిపోయారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇష్టానుసారం మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై వీరు విరుచుకుపడ్డారు. ట్రంప్ వల్ల అమెరికాలో జాతివిధ్వేషదాడులు జరుగుతున్నాయని.. ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికన్లలో విధ్వేషం పొంగి పొర్లుపోతోందని, జాత్యాంహంకారంతో అమెరికన్లు భారతీయులను హత్యలు చేస్తున్నారని.. తన ప్రసంగాల్లో ట్రంప్ ఇండియన్స్ పై విషం కక్కాడని… ఇలా సాగాయి వీళ్ల మాటలు. అమెరికా జాతీయ వాది అయిన ట్రంప్ విషయంలో మనోళ్లు ఎలాటి కథలు పడుతున్నారో, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో… అందరికీ తెలిసిందే.

మరి దేశంలోనే అత్యధిక జనాభా కలిగిన ఒక రాష్ట్రానికి యోగీ ఆదిత్యనాథ్ ను సీఎంగా చేసింది భారతీయ జనతా పార్టీ. ఆయన ఎమ్మెల్యే కాకపోయినా లోక్ సభ నుంచి తెచ్చి సీఎంగా చేసింది. ఈ విషయంలో బీజేపీకి సర్వస్వతంత్రం ఉండవచ్చు గాక. ఇప్పుడు ఇండియన్స్ కోల్పోయే హక్కేమిటంటే.. ట్రంప్ వంటి వాళ్లను తిట్టే హక్కు లేదిక. ట్రంప్ తో పోలిస్తే… ఈ యోగీ ఆదిత్యనాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అత్యంత తీవ్రమైనవి.

సూర్య నమస్కారాలు చేయకపోతే.. పాకిస్తాన్ వెళ్లిపోవాలి.(తొంభై శాతం హిందువులకు సూర్యనమస్కారం ఎలా చేయలో రాదు.. చేసే తీరికా లేదు.) షారూక్ ఖాన్ కు హఫీజ్ సయీద్ కు తేడా లేదు….చెప్పుకొంటూ పోతే ఇలాంటి వ్యాఖ్యలు బొచ్చెడు. ఒకే మాటతో చెప్పాలంటే ఈ ఆదిత్యనాథ్ అలియాస్ అజయ్ సింగ్ హిందుత్వ అతివాది. తన మాటలతో మంటలుపుట్టించిన వ్యక్తి. 

మరి అమెరికాలో జాతి, యూపీలో మతం… అంతే తేడా. మిగతాదంతా సేమ్ టూ సేమ్. ఈ నేపథ్యంలో.. ట్రంప్ నోటిని, అతడి విధానాలను విమర్శించే అర్హత భారతీయులకు పూర్తి గా పోయింది. అయినా… ఆవు మాంసం తిన్నాడన్న నుమానంతోనే ఒక వ్యక్తి ప్రాణాలు తీసిన జాతి వారికి, అమెరికాలో మనోళ్లను కాల్చి చంపితే ఆక్రోశించే హక్కు ఎక్కడిది? అదెప్పుడో పోయిందిగా!

Show comments