సాక్షి వర్సెస్ చంద్రబాబు.. నోటీసులెప్పుడు?!

సదావర్తి భూముల కుంభకోణానికి సంబంధించి తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరుపై ఎదురుదాడి చేసింది సాక్షి పత్రిక. సదావర్తి సత్రం భూముల అమ్మకంలో అక్రమాలు జరిగాయని.. ఇది వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ అని ఆది నుంచి ఈ పత్రిక రాస్తోంది. ఈ అంశాన్ని వైకాపా టేకప్ చేయడం, నిజనిర్ధారణ కమిటీ అంటూ తమిళనాడు వరకూ వెళ్లి రావడం జరిగింది. ఈ అంశంపై కోర్టులో పిటిషన్ దాఖలు కూడా అయ్యింది. అయితే కోర్టు దానికి విచారణార్హత లేదని తేల్చేసింది.

ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్లు ఎదురుదాడి మొదలుపెట్టారు. సదావర్తి స్కామ్ లో తమకు క్లీన్ చీట్ వచ్చేసినట్టే అన్నట్టుగా.. సాక్షిపై విరుచుకుపడ్డాడు తెలుగుదేశం అధినేత. ఆ  అంశం పై వార్తలు రాసిన ఆ పత్రికకు నోటీసులు ఇస్తామని చంద్రబాబు మొన్న ప్రకటించాడు. మరి బాబు నోటీసులు అని హెచ్చరించినా.. సాక్షి వాళ్లు వెనక్కు తగ్గడం లేదు. సదావర్తి అంశంపై మళ్లీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది ఆ పత్రిక.

రూ.1084 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.22 కోట్లకే అప్పనంగా ఇచ్చేస్తారా? ఎకరా భూమి విలువ ఆరు కోట్ల రూపాయలు ఉన్న చోట కేవలం ఎకరాను 27 లక్షల ధరకే ఇచ్చేస్తారా? ఈ విషంలో దేవాదాయ శాఖ నివేదికల మాటేంటి? మార్కెట్ ధర ఎకరాకు రూ.13 కోట్లు ఉన్న చోట కేవలం 27 లక్షల రూపాయలకే ఎకరాను కట్టబెట్టడాన్ని ఏమనాలి? దుర్గ గుడి దగ్గర చెప్పుల స్టాండ్ విషయంలో వేలం మీద పెట్టినంత శ్రద్ధ కూడా వెయ్యి కోట్ల రూపాయల విలువైన భూమిపై లేకపోయిందా? సదావర్తి విషయంలో అడ్డంగా దొరికిపోయి.. ఈ బెదిరింపులు ఏమిటి? అంటూ ‘సాక్షి’ చంద్రబాబుకు ప్రశ్నలు సంధించింది.

నోటీసులు ఇస్తామన్న చంద్రబాబుపై ఈ విధంగా గణాంక సహితమైన ప్రశ్నలతో ఎదురుదాడి చేసింది ఆ పత్రిక. మరి చంద్రబాబు దీనిపై ఏమంటారో! నోటీసులెప్పుడు జారీ చేస్తారో.  Readmore!

Show comments

Related Stories :