అసలు సంగతి దాస్తున్నారు

భాజపా హవా.. మోధీర... బాహుబలి అంటూ మోడీని ప్రశంసించడం వరకు ఓకె. ఘనవిజయాన్ని సాధించారు కాబట్టి ఆ మేరకు కీర్తించడం ఎంతమాత్రం తప్పుకాదు. కానీ అసలు అధికార వ్యతిరేక ఓటు సంగతేమిటి? ఈసారి ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోని పోలింగ్ సరళి ఈ విషయాన్ని కూడా బయటపెట్టింది కదా? ఎంతో అద్భుతమైన పాలన అనుకున్న గోవాతో సహా. మరి ఈ విషయాన్ని తెలుగు మీడియా ఎందుకు విస్మరిస్తోంది?

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేక ఓటు బ్యాంక్ వుండదని, ఏర్పడడం లేదని మీడియా భావిస్తోందా? చంద్రబాబు, కేసిఆర్ చరిష్మాలు 2014 నాటికి కేవలం వ్యక్తిగతమైనవి. ఉద్యమనేతగా కేసిఆర్,  అనుభవశీలిగా చంద్రబాబు తమ తమ ప్రొఫైల్స్ ను జనం ముందు వుంచారు. వారు ఆమోదించారు. అయితే 2019 నాటికి మళ్లీ ఈ ఫ్రొఫైల్స్ తోనే జనం ముందుకు వెళ్తామన్నా కుదరదు. వెళ్లే పరిస్థితి లేదు. ఉంటే గింటే అలాంటి అవకాశం ఆంధ్రలో పవన్ కళ్యాణ్ కు మాత్రం వుంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఓ ప్రజా ప్రతినిధిగా ఎలా వ్యవహరిస్తారో జనానికి ఇంకా తెలియదు కనుక.

2019 నాటికి కేసిఆర్, చంద్రబాబు, జగన్ లకు ప్రజల దగ్గర ఓటు బ్యాంక్ ను పెంచినా, తగ్గించినా ఈ అయిదేళ్ల పనితీరు మాత్రమే. ఈ అయిదేళ్లలో అధికార పక్షాలు ఏ మేరకు పని చేసాయి, ప్రజల సమ్యసలు, అభివృద్ధి, ఇలాంటివి అన్నీ కౌంట్ లోకి వస్తాయి. అదే ప్రతిపక్షనేత అయితే ప్రజా సమస్యల మీద ప్రజల కోసం ఏ మేరకు పోరాడేరన్నది లెక్కలోకి వస్తుంది.

మరి ఈ విషయం విస్మరించి, అప్పుడే మోడీ ప్లస్ చంద్రబాబు కలిస్తే మళ్లీ అధికారం పక్కా అని, పవన్ తెలుగుదేశం వైపు లేకున్నా వచ్చిన నష్టం లేదని, అలా వుంటే అతనికి అధికారం సంప్రాప్తించదని సర్వేలు, కథనాలు వండి వాట్సప్ చేస్తున్నారు. కానీ నందమూరి వారసురాలు, భాజపా నాయకురాలు పురందేశ్వరి మాత్రం కుండ బద్దలు కొట్టనే కొట్టారు. ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో అధికార వ్యతిరేక ఓటు క్లియర్ గా కనిపించిందని, అందువల్ల రెండేళ్ల తరువాత చంద్రబాబు, తెలుగుదేశం పరిస్థితి బాగుంటే పొత్తు పెట్టుకుంటాం, లేదంటే కటీఫ్ అని చెప్పకనే చెప్పారు. Readmore!

పురందేశ్వరి కటీఫ్ అంటే అయిపోదు. బాబుకు భాజపాతో లయిజినింగ్ చేసేవాళ్లు బోలెడు మంది వున్నారు. అయితే నిజంగా బాబు పరిస్థితి బాగుండనప్పుడు, లయజనింగ్ చేసి భాజపాతో పొత్తు పెట్టుకున్నా, ఓట్లు రాబట్టడం కష్టం. అప్పుడు అధికార వ్యతిరేక ఓటు అన్నది భాజపాపై కూడా ప్రభావం చూపిస్తుంది.

ప్రస్తుతానికి అయితే మోడీ విజయం పెద్దక్షరాల్లో చాటుతూ, అధికార పక్షాల ఓటమి అన్నదాన్ని వీలయినంత దాచేస్తోంది మన తెలుగు ప్రభుత్వాల అనుకూల మీడియా.

Show comments

Related Stories :