ఆధార్ లేకపోతే ట్రైన్ టికెట్ కష్టమే ఇక!

మీకు ఆధార్ కార్డు లేదా? అయితే.. ట్రైన్ లో ముందస్తు టికెట్ బుకింగ్ కష్టం అంటోంది రైల్వే శాఖ. రైల్వే టికెట్ బుకింగ్స్ విషయంలో ఆధార్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకోనుంది రైల్వే శాఖ. ఈ మేరకు త్వరలోనే ఈ నియామాన్ని అమలు పరచనున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే రైల్వే శాఖ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కు ఆధార్ ను తప్పనిసరి చేయనుందని తెలుస్తోంది.

అయితే.. ఆధార్ తో, రైల్వే బుకింగ్స్ ను అనుసంధానించాలన్న నిర్ణయం పాతదే. కాని ఇప్పుడు దాన్ని పటిష్టంగా అమలుపరచనున్నారట. మరి ఈ నిర్ణయంతో ఇప్పటికీ ఆధార్ కార్డులేని వాళ్లు ఇబ్బందులు పడనున్నారు. అలాగే బుకింగ్స్ సమయంలో ఒక పేరు ఇచ్చి, ప్రయాణం మరొకరు చేసే అవకాశానికి కూడా ఈ నియమం ద్వారా చెక్ చెప్పనున్నామంటున్నారు.

ఒకరి పేరుతో బుక్ అయిన టికెట్స్ తో మరొకరు ప్రయాణం చేయడం ఇండియన్ రైళ్లలో చాలా కామన్ గా జరిగే పనే. ఇప్పుడు ఆధార్ ను తప్పనిసరి చేయడం ద్వారా ఈ అవకాశం ఉండకుండా చేయాలని రైల్వే శాఖ భావిస్తోందట. అయినా.. టికెట్టే లేకుండా రైళ్లలో ప్రయాణాలు చేసే భారతీయుల ముందు ఇలాంటి నియమాలకు విరుగుడు మంత్రాలు లేవా ఏంటి? టీసీ చేయి తడిపితే.. అన్నీ సర్దుకోవా?

Show comments