ఆంధ్ర జనసేన

మొత్తానికి పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని ఆంధ్ర వరకే పరిమితం చేయాలని డిసైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. అసలు జనసేన పార్టీ కార్యక్రమాలే అంతంత మాత్రం. ప్రజాసమస్యలపై ప్రశ్నించడానికే జనసేన అన్న పవన్ కళ్యాణ్ ఆ లక్ష్యానికి ఏనాడో తిలోదకాలు ఇచ్చేసారు.  

తెలంగాణలో గడచిన రెండున్నరేళ్లలో ఆయన ఒక్క కార్యక్రమం చేసిన దాఖలా లేదు. ఇటీవల హైదరాబాద్ లో రోడ్ల సమస్య కూడా పవన్ కు పట్టలేదు.  తెలంగాణ మొత్తం మీద ప్రజా సమస్యలు అన్నవి పవన్ దృష్టికి రాలేదు. పోనీ అలా అని ఆంధ్రలో ఊడబొడిచింది ఏదన్నా వుందా అంటే అదీ లేదు. ఇప్పటికి బయటకు వచ్చిన ప్రతిసారి ముందుగా బోలెడు ఆర్భాటం, తీరా వచ్చాక, బాబు కోసం వచ్చినట్లు తేలిపోవడం.

ఇప్పుడు లేటెస్ట్ గా జనసేనాధిపతి తన ఓటును వెస్ట్ గోదావరిలో నమోదు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అంటే నేను పక్కా ఆంధ్ర లోకల్ అని ఆయన చాటాలాని డిసైడ్ అయిపోయినట్లు కనిపిస్తోంది. తెలంగాణలో జనసేన కార్యక్రమాలు లేవు. జనసేనాధిపతికి ఓటు వుండదు. అంటే అంటే ఇక జనసేన పార్టీ పూర్తిగా ఆంధ్రకే పరిమితం అనుకోవాల్సిందే. 

Show comments