మహేష్‌ వర్సెస్‌ చరణ్‌... మళ్లీనా?

మహేష్‌బాబు, చరణ్‌ చిత్రాల మధ్య రెండుసార్లు సంక్రాంతికి పోటీ జరిగింది. ఎవడు వర్సెస్‌ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పోటీలో రెండూ విజయవంతమైనా కానీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు పైచేయి సాధించింది. ఆ తర్వాతి సంవత్సరం మరోసారి వీరిద్దరి నడుమ పోటీ ఏర్పడింది.

'1 నేనొక్కడినే', 'ఎవడు' మధ్య జరిగిన పోటీలో మహేష్‌ సినిమా ప్రశంసలతో సరిపెట్టుకుంటే, చరణ్‌ చిత్రం కమర్షియల్‌ సక్సెస్‌ సాధించింది. వచ్చే సంక్రాంతికి మళ్లీ ఈ ఇద్దరి సినిమాల మధ్య పోటీ జరగనుంది. మహేష్‌, కొరటాల శివ 'భరత్‌ అనే నేను' చిత్రంతో వస్తుంటే, చరణ్‌, సుకుమార్‌తో కలిసి 'రంగస్థలం 1985' చూపించబోతున్నాడు.

ఈసారి మహేష్‌ పూర్తి స్థాయి మాస్‌ మూవీ చేస్తోంటే, చరణ్‌ మాత్రం సుకుమార్‌తో ప్రయోగాత్మక చిత్రం చేస్తున్నాడు. భరత్‌ అనే నేను షూటింగ్‌ ఈమధ్యే మొదలు కాగా, రంగస్థలం 1985 షూటింగ్‌ కూడా రాజమండ్రి పరిసరాల్లో జరుగుతోంది. ఈ ఆసక్తికరమైన పోటీలో ఈసారి అప్పర్‌ హ్యాండ్‌ ఎవరిది అవుతుందో చూడాల్సిందే.

Readmore!
Show comments

Related Stories :