ఎన్టీఆర్ కు గ్యాప్ తప్పదా?

వరుసగా ప్రాజెక్టులు సెట్ చేసుకుని, కూల్ గా షూట్ లు చేసుకుంటూ వెళ్తున్నారు ఎన్టీఆర్. బాబీ ఆ తరువాత త్రివిక్రమ్, ఆపై కొరటాల శివ ఇలా క్రేజీ ప్రాజెక్టులు రెడీ చేసుకున్నారు. తొలిగా ఈ దసరాకు బాబీతో చేస్తున్న జై లవకుశ విడుదలకు ప్లాన్ చేస్తున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా స్టార్ట్ చేయాలి. కానీ ఇక్కడే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు గ్యాప్ వచ్చేలా కనిపిస్తోంది.

ఎందుకంటే త్రివిక్రమ్-పవన్ సినిమా అనుకున్నట్లుగా దసరాకు రావడం లేదు. దసరాకు ఫినిష్ అయితే చేయాలని చూస్తున్నారు. ఒక వేళ అనుకున్నట్లు ఫినిష్ అయినా, విడుదల మాత్రం సంక్రాంతికే. అందువల్ల ఆ సినిమా వ్యవహారాలు ఇంకా త్రివిక్రమ్ ను వదలవు. ఆ సినిమా సంక్రాంతికి విడుదలైతే, త్రివిక్రమ్ అప్పుడు ఖాళీ అవుతారు. కానీ దసరా నుంచే ఎన్టీఆర్ రెడీగా వుంటారు. అంటే అక్టోబర్ స్టార్టింగ్ నుంచి, జనవరి ఎండ్ వరకు ఎన్టీఆర్ కు గ్యాప్ తప్పదు. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది.

కొరటాల శివ సినిమా తరువాత వెంటనే సినిమా పట్టాలు ఎక్కలేదు. అయితే త్రివిక్రమ్ సినిమా తరువాత కొరటాల శివ సినిమా చేయాలి. కొరటాల ఆగస్టు నుంచి మహేష్ సినిమా ఆరంభించి, సమ్మర్ వేళకు రెడీ చేసే ఆలోచనలో వున్నారు. కానీ అప్పుడు కొరటాల ఖాళీ అయినా, ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో వుంటారు. జనతా గ్యారేజ్ తరువాత మహేష్ అందుబాటులో లేక కొరటాల అలాగే కొన్నాళ్లు స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటూ వుండిపోయారు.

Show comments