శర్వానంద్‌ టెక్నిక్‌ అదే

సాధారణంగా ఏ హీరో అయినా దర్శకులని నమ్ముకుని కెరీర్‌ బిల్డ్‌ చేసుకోవాలని చూస్తాడు. ఒక డైరెక్టర్‌ ట్రాక్‌ రికార్డ్‌ని పరిగణనలోకి తీసుకుని అతడితో చేయాలా వద్దా అని డిసైడ్‌ చేసుకుంటాడు. కానీ శర్వానంద్‌ మాత్రం డైరెక్టర్ల ట్రాక్‌ రికార్డ్‌ని లెక్క చేయడం లేదు. అతను నిర్మాతల హీరోగా అవతరిస్తున్నాడు.

పేరున్న నిర్మాతలతో శర్వానంద్‌ ఒప్పందాలు చేసుకుంటున్నాడు. సక్సెస్‌ కోసం తపించిపోయే యువి క్రియేషన్స్‌, దిల్‌ రాజులాంటి వాళ్లతో డీల్‌ కుదుర్చుకోవడం వల్ల తన పని తేలిక అయిపోతుంది. సినిమా ఎలా తెరకెక్కాలి దగ్గర్నుంచి, ఎప్పుడు విడుదల చేయాలి, ఎలా మార్కెటింగ్‌ చేయాలి అంటూ వాళ్లే ఒక ప్రణాళిక వేసుకుని శర్వానంద్‌కి హిట్స్‌ ఇచ్చేసారు. 

సంక్రాంతికి విపరీతమైన పోటీ మధ్య రెండు సినిమాలు రిలీజ్‌ అయినా శర్వానంద్‌కి రెండిటితోను హిట్స్‌ వచ్చాయి అంటే అది నిర్మాతల ప్లానింగ్‌ వల్లే. అందుకే ఇకపై కూడా ఇదే సూత్రం ఫాలో అయిపోవాలని డిసైడ్‌ అయి, నెక్స్‌ట్‌ బాహుబలి నిర్మాతలతో ఒక సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ చిత్రానికి రెండు పెద్ద ఫ్లాప్‌లిచ్చిన ప్రకాష్‌ కోవెలమూడి దర్శకుడైనా కానీ శర్వానంద్‌కి ఆ చింత ఏమీ లేదు. 

Show comments