కబాలి టూ క్లాస్ మూవీ?

కబాలి సెన్సారు పూర్తయింది..విడుదలకు సిద్ధమైపోయింది. మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కొచ్చడియాన్, లింగా సినిమాలతో రెండు భయంకరమైన దెబ్బలు తిని వున్నారు రజనీ సినిమా కొన్న తెలుగు బయ్యర్లు. ఆ సినిమాలకు కూడా ఇంతే హైప్ వచ్చింది. ఇప్పుడు కబాలి ట్రయిలర్లు, టీజర్లు, తమిళ వెర్షనకు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న, చేస్తున్న పబ్లిసిటీతో మరోసారి మోత మోగిపోతోంది. అయితే సినిమా టాక్ ఎలా వుందీ అని ఆరా తీస్తే మాత్రం, డిఫరెంట్ గా వినిపిస్తోంది.

సినిమా స్టయిలిష్ గా, క్లాస్ గా వుంటుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కాస్త స్లో నేరేషన్ వుంటుందని అంటున్నారు. సినిమా స్టయిలిష్ మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాగా వుంటుందని, రజనీ అభిమానులకు నచ్చుతుందని ఓ టాక్ వినిపిస్తోంది. ఈ వయసులో రజనీ మరీ అద్భుతమైన ఫైట్ లు అందించడం కష్టం. పాటలు కూడా ఈసారి అంతగా క్లిక్ కానట్లుగానే వున్నాయి. 

ఇక రజనీ స్టయిల్, డైలాగులు సినిమాను ఆదుకోవాల్సి వుంటుంది. అయితే కాస్త క్లాస్ టచ్ తో స్క్రీన్ పైకి తేవడం వల్ల  బి, సి సెంటర్ల నుంచి ఎలాంటి రెస్పాన్స్  వుంటుందన్నది చూడాల్సి వుంది.  దర్శకుడు రంజిత్ తమిళ నాట డిఫరెంట్ సినిమాలు తీసే వెంకట్ ప్రభు శిష్యుడు. ఇప్పుటికి రెండు సినిమాలు అందించారు. ఒకటి అట్టకత్తి, రెండు మద్రాస్. మొదటి సినిమా కాస్త కామెడీ టచ్. రెండవ సినిమా అర్బన్ బేస్డ్ పొలిటికల్ టచ్ వున్నది.  ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్. 

ఇదంతా గురువు వెంకట్ ప్రభు స్టయిలే. చేసిన జోనర్ లో సినిమా చేయకుండా చేసుకుంటూ వెళ్లడం. వెంకట్ ప్రభు కూడా అంతే. మంచి డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కానీ, మరీ మంచి హిట్ లు అందించలేదు. కానీ శిష్యుడిగా రంజిత్ మాత్రం ఆ ఫీట్ చేస్తారనే అనుకోవాలి. తొలి రెండు సినిమాలు కమర్షియల్ గా ఫెయిల్ కాలేదు. కబాలి మూడో సినిమా. అయితే ఇది పది ఇరవై కోట్ల సినిమా కాదు. ఏకంగా 150-200 కోట్ల సినిమా. మరి ఈ లెవెల్ సినిమాను రంజిత్ ఎలా డీల్ చేసాడో చూడాల్సి వుంది. 

కబాలి బాగా ఆడితే రజనీ తరువాతి సినిమా రోబో 2 కి కేక్ వాక్ అవుతుంది. లేదూ అంటే మూడు పరాజయాల తరువాత ఇబ్బందుల్లో పడాల్సి వుంటుంది.

Show comments