దిల్ రాజు అమ్మేస్తున్నారు

అరటి చెట్టూ లేదు..గెలా లేదు..కాయ పది రూపాయలు అన్న చందంగా, హరీష్ శంకర్-బన్నీ సినిమా ఇంకా పట్టాలు ఎక్కలేదు. దసరా వెళ్లిన తరువాత మొదలవుతుంది అని అంటున్నారంతే. కానీ ఈలోగా హరీష్ శంకర్-బన్నీల  దువ్వాడ జగన్నాధమ్ సినిమా అమ్మకాలకు మాత్రం దిల్ రాజు శ్రీకారం చుట్టేసారు. 

ఎవరికి ఏ ఏరియా కావాలంటే ఆ ఏరియా ఇచ్చేసి, అడ్వాన్స్ లు పుచ్చేసుకునే పనిలో పడ్డారని వినికిడి. ఓవర్ సీస్ అమ్మేసారు. మరి కొన్ని ఏరియాలు బేరాలవుతున్నాయని తెలుస్తోంది. శాటిలైట్ కూడా డిస్కషన్లు మొదలు పెట్టేస్తున్నారు.

మరి దిల్ రాజు ఎందుకిలా చేస్తున్నారో? ఆయన ఒకేసారి పలు సినిమాల పని పెట్టుకున్నారు, చాలా ఎక్కువ స్టార్ట్ కాస్ట్ తో శతమానం భవతి షూటింగ్ చేస్తున్నారు . మరి వీటన్నింటికి ఫండింగ్ కోసం ఇలా చేస్తున్నారా అని అనుమానం.

Show comments