జయ జానకీ నాయక..బోయపాటి టైటిల్

బోయపాటి – బెల్లంకొండ సినిమా టైటిల్ బయటకు వచ్చేసింది. జయ జానకీ నాయక అన్నది టైటిల్. ఈ సినిమా ప్రారంభం చేసిన దగ్గర నుంచి ఫ్యామిలీ టైటిల్ కావాలని బోయపాటి కిందా మీదా అయ్యారు. చాలా మందితో ఆలోచించారు. ఆఖరికి ఈ టైటిల్ డిసైడ్ చేసారు.

శ్రీరామరాజ్యం చిత్రంలో పాపులర్ అయిన జగదానంద దాయక జయ జానకీ ప్రాణ నాయక అన్న లైన్ లోంచి ఈ టైటిల్ ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది.

జానకిని గెల్చుకుని జయ జయ ధ్వానాలు అందుకున్న రాముడు స్ఫురణకు వచ్చేలా ఈ టైటిల్ డిసైడ్ చేసినట్లు బోయపాటి వివరిస్తున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నఈ చిత్రం టాకీ ఇటీవలే పూర్తయింది. ఇక పాటల చిత్రీకరణ బాకీ వుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత.

Show comments