పిక్‌ టాక్‌: గుంటూరోడితో ముఠామేస్త్రి

ఫొటో అదిరింది కదూ.! ముఠా మేస్త్రి గెటప్‌లో మెగాస్టార్‌ చిరంజీవి.. ఇంకో పక్క 'గుంటూరోడు' సినిమా టైటిల్‌తో మంచు మనోజ్‌. విషయమేంటంటే, మెగాస్టార్‌ చిరంజీవి.. మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'గుంటూరోడు' సినిమాకి వాయిస్‌ ఓవర్‌ అందిస్తున్నారు. వెండితెరపై హీరోగా రీ-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సూపర్‌ జోష్‌ కొనసాగిస్తున్నారు. 'ఖైదీ నెంబర్‌ 150' సినిమా సక్సెస్‌ తర్వాత, సినిమా పరిశ్రమతో మరింతగా ఇంటరాక్ట్‌ అవుతున్నారాయన. 

రాణా హీరోగా నటించిన 'ఘాజీ' సినిమాకి చిరంజీవి వాయిస్‌ ఓవర్‌ అందించిన విషయం విదితమే. తాజాగా, ఇప్పుడు మంచు మనోజ్‌ హీరోగా నటించిన 'గుంటూరోడు' సినిమాకి వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. పోస్టర్‌లో మెగాస్టార్‌ చిరంజీవికి 'గుంటూరోడు' టీమ్‌ థ్యాంక్స్ తెలిపింది. మెగాస్టార్‌ చిరంజీవికీ, మోహన్‌బాబుకీ మధ్య 'గిల్లికజ్జాల' గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆ గిల్లికజ్జాల సంగతెలా వున్నా, తామిద్దరం మంచి స్నేహితులమని పలు సందర్భాల్లో చిరంజీవి, మోహన్‌బాబు చెప్పుకొస్తూనే వున్నారనుకోండి.. అది వేరే విషయం. 

మొత్తమ్మీద, 'గుంటూరోడు' సినిమాకి మెగా వాయిస్‌ ఓవర్‌ కారణంగా, మరింత హైప్‌ వచ్చే ఛాన్సుంది. మనోజ్‌ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో 'కంచె' ఫేం ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటించింది.

Readmore!
Show comments