ఎన్టీఆర్ లుక్ లాక్ చేసిన బాబి

కొత్త సినిమాలో ఎన్టీఆర్ 3 ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడనే విషయం తెలిసిందే. ఇందులో ఓ లుక్ కోసం ఇప్పటికే దుబాయ్ వెళ్లొచ్చాడు తారక్. మరో లుక్ కోసం కండలు పెంచే పనిలో పడ్డాడు. తాజాగా మూడో గెటప్ కు సంబంధించి ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా ఫొటోషూట్ నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఫొటో షూట్ జరగ్గా... ఫైనల్ గా వాటిలోంచి ఓ లుక్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులతో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే కొత్త గెటప్ తో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు తారక్. ఒక్కసారి న్యూలుక్ లోకి వచ్చిన తర్వాత.. ఆ గెటప్ తో షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు మీడియాకు కనిపించకూడదని నిర్ణయించుకున్నాడు. అలా సినిమాకు సంబంధించిన 3 గెటప్స్ ను సీక్రెట్ గా మెయింటైన్ చేయాలని అనుకుంటున్నారు.

ఈ ప్రాజెక్టుకు జై లవకుశ అనే టైటిల్ ను దాదాపు ఫిక్స్ చేశారు. టైటిల్ కు తగ్గట్టు జై, లవ్ కుమార్, కుషాల్ అనే 3 పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడట. ఇందులో ఓ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్ లో ఉంటుందని టాక్.

Show comments