డిజెలో హరీష్ కు వాటా?

ఈ మధ్య టాలీవుడ్ లో అలవాటైపోతున్న ట్రెండ్ ఏమిటంటే, డైరక్టర్లే ప్యాకేజ్ డీల్ సెట్ చేసుకోవడం. ఇంతలో సినిమా చేసి ఇస్తా. లేదా రెమ్యూనిరేషన్ కొంచెం తీసుకుని, లాభాల్లో పదిపైసలో, పావలానో వాటా తీసుకుంటా. ఇలా అన్నమాట. దానివల్ల నిర్మాతపై భారం కాస్త తగ్గుతుంది. అలాగే సినిమాను జాగ్రత్తగా తీస్తారు. పైగా ఖర్చు అవధులు దాటించరు అనే భరోసా అన్నమాట.

నిజానికి ఈ వ్యవహారానికి పూరి జగన్నాధ్, రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో తెరతీసారు. ఇప్పుడు మిగిలిన వారు కూడా రాను రాను ఈ బాట పడుతున్నారు. త్వరలో విడుదల కాబోయే కేశవ సినిమాను అన్ని రెమ్యూనిరేషన్లు, ఖర్చులు కలుపుకుని, ఏడు కోట్లలో తీసి ఇచ్చాడు డైరక్టర్ సుధీర్ వర్మ. అలాగే మిస్టర్ సినిమా విషయంలో రెమ్యూనిరేషన్ గా కొంచెం తీసుకుని, లాభాలు వస్తే వాటా తీసుకుంటా అన్నారు శ్రీనువైట్ల. అలాగే నష్టాలు భరిస్తా అన్నారు అనుకోండి.

ఇక బాహుబలి ప్రాజెక్టు అయితే రాజమౌళి అయిదేళ్లు ఖర్చులు మాత్రం తీసుకుని మూడో వంతు లాభాలు తీసుకునేలా ఒప్పందం పెట్టుకున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏమిటంటే, అల్లు అర్జున్ తో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న డిజె సినిమాకు దర్శకుడు హరీష్ శంకర్ చాలా తక్కువగా నామినల్ గా మాత్రమే రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారట. సినిమా హిట్ చేసి చూపించి, లాభాల్లో వాటా తీసుకుంటా అన్నారట. దానికి గాను ఓకె అని దిల్ రాజు కొంత శాతం లాభం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అది ఎంత శాతం అన్నదే ఇంకా తెలియదు,

Show comments