ఇండస్ట్రీలో ఎవరన్నా మిగిలారా?

టీ సుబ్బరామి రెడ్డి సంగతి అందిరకీ తెలిసిందే. ఆయన అజాత శతృవు. ఆడా వుంటా, ఈడా వుంటా అన్నట్లు, ఆయన అన్ని పార్టీల్లోనూ వుంటారు. అందరు హీరోలతోనూ వుంటారు. అందరితోనూ వుంటారు. అందుకే ఆయన సంస్థ తరపున ఇచ్చే అవార్డులు కూడా అలాగే వుంటాయి. ఇండస్ట్రీలో జనాలను వెదికి వెదికి మరీ, పట్టుకుని, ఆ ఏడాది చేసిన పనేమిటి? వేసిన వేషమేమిటి? దానికి తగ్గ టైటిల్ ఒకటి తగిలించి అవార్డు ప్రకటించేయడమే. ఆఫ్ కోర్స్ దీనికి కో స్పాన్సర్లు, కమిటీలు ఇలాంటివి అన్నీ వుంటాయనుకోండి.

ఈ లిస్ట్ చూడండి. బెస్ట్ హీరో అల్లు అర్జున్, బెస్ట్ యాక్టర్ వెంకటేష్, బెస్ట్ డెబిట్ హీరో ఆకాష్ పూరి, నేషనల్ స్టార్ ప్రభాస్, బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ రానా, మాస్ ఎంటర్ టైనర్ కళ్యాణ్ రామ్, స్పెషల్ అప్రిసియేషన్ నాగ్ చైతన్య, బెస్ట్ ఆల్ రౌండర్ రాజేంద్ర ప్రసాద్...ఇలా సాగిపోయింది జాబితా. మరో ఏడాది జాబితాలో నాగార్జున, బాలకృష్ణ, రామ్ చరణ్, నాని, శర్వానంద్, నారా రోహిత్, విజయ్ దేవరకొండను కూడా కవర్ చేసేసారు.

అవును పాపం, పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను ఎందుకు వదిలేసారో?

Show comments