ఐ డోంట్ కేర్ అంటున్న లావణ్య

మిస్టర్ సినిమా ఫ్లాప్ అయింది కదా.. దీనిపై మీ రెస్పాన్స్ ఏంటి?
-  ఐ డోంట్ కేర్

ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు.. లెక్కబెట్టుకున్నారా..?
-  ఐ డోంట్ కేర్

నంబర్ గేమ్ పై మీ అభిప్రాయం ఏంటి..?
-  ఐ డోంట్ కేర్

ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి వన్ వర్డ్ ఆన్సర్స్ ఇవి. రాధ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన ఈ బ్యూటీ.. కొన్ని ప్రశ్నలకు ఇలాంటి సమాధానాలే ఇచ్చింది. కొన్ని ప్రశ్నలకు “ఐ డోంట్ కేర్” అంటూనే, మరికొన్ని ప్రశ్నలకు అదే అర్థంవచ్చేలా సమాధానాలిచ్చింది.

మిస్టర్ లాంటి డిజాస్టర్ తో ఈ ఇయర్ ను ప్రారంభించింది లావణ్య త్రిపాఠి. ఈ వీకెండ్ రాధ సినిమాతో మరోసారి మనముందుకొస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం మీడియా ముందుకొచ్చిన లావణ్య. మిస్టర్ గురించి కచ్చితంగా అడుగుతారని మెంటల్లీ ప్రిపేర్ అయి మరీ వచ్చినట్టు కనిపించింది. అందుకే ప్రశ్న అడగడమే ఆలస్యం.. హిట్-ఫ్లాప్స్ నేను పట్టించుకోనంటూ ఠక్కున సమాధానమిచ్చింది.

కేవలం మిస్టర్ కు సంబంధించిన మేటర్ కే కాకుండా.. మరికొన్ని ప్రశ్నలకు కూడా ఇలానే ముక్తసరిగా సమాధానమిచ్చింది లావణ్య. మొన్నటివరకు బాగా మాట్లాడిన ఈ అమ్మాయికి ఇంత సెడన్ గా ఏమైందో ఏమో..! చేసిన అరడజను సినిమాలకే  సీనియర్ అయిపోయిందా.. లేక స్టార్ డమ్ వచ్చేసినట్టు ఫీల్ అవుతోందా..!

Show comments