ఈ జీవితానికి ఇదే ఆఖరి సినిమా

కత్రినాకైఫ్ క్లారిటీ ఇచ్చేసింది. రణబీర్ కపూర్ తో తన ఎపైర్ ముగిసిపోయిందని చెప్పకనే చెప్పేసింది. అవును.. జగ్గా జాసూస్ సినిమానే రణబీర్ తో కలిసి తను చేసిన ఆఖరి సినిమా అని ప్రకటించింది కత్రినాకైఫ్. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ విషయంపై కత్రినాను ప్రశ్నించింది మీడియా.

మళ్లీ రణబీర్ తో సినిమా ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానంగా.. "ఈ జీవితానికి ఇదే ఆఖరి సినిమా" అని ప్రకటించింది కత్రినాకైఫ్. అయినా మీ అందరికీ మేటర్ తెలుసు కదా.. కొత్తగా అడుగుతారేంటి అంటూ నవ్వుతూ మీడియాపై చిరాకు ప్రదర్శించింది.

కత్రిన ప్రకటనతో వాళ్లిద్దరూ విడిపోయారనే విషయం అధికారికం అయింది. మరోవైపు రణబీర్ మేనేజర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. కత్రినతో సినిమా చేయడానికి రణబీర్ కు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే రాబోయే 2-3 ఏళ్లలో రణబీర్ కాల్షీట్లు బుక్ అయిపోయాయని కవర్ చేస్తున్నాడు.

విడిపోయినా కలిసి సినిమాలు చేసే కల్చర్ సౌత్ లో ఉంది. శింబు-నయనతార కలిసి సినిమా చేశారు. విశాల్-వరలక్ష్మి కలిసి త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు. కానీ రణబీర్-కత్రిన జోడీ మాత్రం సిల్వర్ స్క్రీన్ పైకి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. Readmore!

Show comments

Related Stories :