ఆఖరికి అరవింద్ దేవో భవ

మొత్తానికి లాస్ట్ మినిట్ లో అల్లు అరవింద్ రంగప్రవేశం చేసారు. ఆది నుంచీ రామ్ చరణ్ అండ్ కో తమ చిత్తానికి చేసుకుంటూ వెళ్లారు ఖైదీ నెంబర్ 150 సినిమా విషయంలో. సినిమా అమ్మకాలు కానీ, నిర్మాణ వ్యవహారాలు కానీ, అన్నీ అరవింద్ కు దూరంగానే జరిగాయి. ఒక్కసారి విజయవాడలో గ్రౌండ్ చూడ్డానికి మాత్రమే అరవింద్ ఎంటర్ అయ్యారు. ఆ తరువాత మళ్లీ సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో మళ్లీ అరవింద్ అవసరం తప్పలేదు. 

హాయ్ ల్యాండ్ లో సభ జరిపే వ్యవహారం మొత్తాన్ని ఇప్పుడు అరవింద్ బ్యాచ్ మీద పెట్టేసారు చిరంజీవి చాలా తెలివిగా. సభ నిర్వహణ ఎలా చేయాలి? ఎవరు చేయాలి? ఇలాంటి వ్యవహారాల్లో అనుభవం తక్కువ. అన్నింటికి మించి మ్యాన్ పవర్ లేకపోవడంతో అరవింద్ అండ్ కో కు అప్పగించేసారు. దీంతో గీతా టీమ్ మొత్తం ఇప్పుడు ఛలో విజయవాడ అంటోంది. 

ఇదిలా వుంటే, తాము అనుకున్న ప్రీమియమ్ రేట్లు ఎవరు ఇస్తే వారికే సినిమా హక్కులు అన్న టైపులో రెండు తెలుగు  రాష్ట్రాల్లో ఖైదీ నెంబర్ 150 సినిమాను విక్రయించారు. కానీ ఇప్పుడు విడుదల సమయానికి వచ్చేసరికి థియేటర్లు కావాల్సివచ్చింది. రెండు రాష్ట్రాల్లో థియేటర్ల వ్యవహారం మొత్తం చూడాలంటే, కేవలం ఈ బయ్యర్లు సరిపోరు. వీళ్లపై ఓ కమాండ్ కంట్రోల్ వుండాలి. 

అందుకే మళ్లీ అరవింద్ అవసరం పడింది. అరవింద్ చేయి చేసుకుంటే, దిల్ రాజు చేయి చేసుకోక తప్పదు, యువి క్రియేషన్స్ ఇలా అరవింద్ తో డీల్స్ వున్న ప్రతి ఒక్కరు కదలాల్సిందే. అందుకే అరవింద్ కు మళ్లీ ఇప్పుడు ఆ బాధ్యతలు కూడా చిరంజీవి నేరుగా అప్పగించినట్లు వినికిడి. Readmore!

Show comments

Related Stories :