మొత్తానికి 'ఆ సినిమా' మొదలయింది

క్రేజీ ప్రాజెక్టు గా ప్రకటించారు కొన్ని నెలల క్రితం నితిన్ అండ్ కో. అదెలా అంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యానర్, ఆయన మిత్రుడు త్రివిక్రమ్ కథ, వారికి నచ్చిన రచయిత, దర్శకుడు కృష్ణ చైతన్య మాటలు, దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించే సినిమా. ఈ సినిమా నిర్మాణంలో నితిన్ స్వంత బానర్ తో పాటు పవన్ కళ్యాణ్ బ్యానర్ కూడా పాలు పంచుకుంటోదని, త్రివిక్రమ్ కు కూడా ప్రొడక్షన్ లో వాటా వుంటుందని గతంలోనే వార్తలు వినవచ్చాయి. 

అయితే లై ప్రాజెక్టు మీదకు వెళ్లి, ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాడు నితిన్. ఇప్పుడు లై ప్రాజెక్టు పూర్తికావడంతో, ఈ సినిమాను స్టార్ట్ చేసారు. ఇక చకచకా షూటింగ్ జరుపుకుంటుదట ఈ ప్రాజెక్టు. ఈ సినిమా పూర్తయితే  రాధామోహన్ నిర్మాతగా మరో సినిమా చేయాల్సి వుంది నితిన్. 

లై మాదిరిగానే కృష్ణ చైతన్య సినిమా కూడా ఎక్కువ భాగం అమెరిగాలో షూటింగ్ జరుపుకుంటుందట. రాజీవ్ నాయర్, నటరాజ సుబ్రహ్మణియం, థమన్ లాంటి బడా టెక్నీషియన్లు పని చేస్తున్నారు ఈ సినిమాకు. మరి పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పేర్లు జత కలిపాక ఆ మాత్రం రేంజ్ వుండాలి కదా?

Show comments