బన్నీకి కథ చెప్పినట్లా? లేదా?

బన్నీకి హరీష్ శంకర్ కథ నెరేట్ చేసారా? లేదా? ఇదీ ఇప్పుడు గీతా ఆర్ట్స్ కు సంబంధించినంత వరకు మిలియన్ డాలర్ల ప్రశ్న. దిల్ రాజు ప్రత్యక్ష భాగస్వామ్యం, గీతా ఆర్ట్స్ పరోక్ష భాగస్వామ్యంలో హరీష్ శంకర్ డైరక్షన్ లో ఓ సినిమా చేయడానికి బన్నీ ఓకె చేసాడు. అయితే హరీష్ శంకర్ లైన్ చెప్పారా? కథ మొత్తం చెప్పారా? అన్నది డవుట్. లైన్ మాత్రమే చెప్పారని, కథ రెడీ అవుతోందని టాలీవుడ్ వర్గాల బోగట్టా. కథ వండే ప్రయత్నంలో హరీష్ వున్నారని తెలుస్తోంది.

కానీ ఈ లోగానే రావు రమేష్ కు కీలక పాత్ర, అలాగే మరో మాంచి ఎంటర్ టైన్ మెంట్ పాత్ర వెన్నెల కిషోర్ కు రెడీ చేసారని, పూజా హెగ్డేను కథానాయికగా ఫిక్స్ అయిపోయారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ గీతా వర్గాల నుంచి వినిపిస్తున్న బోగట్టా ఏమిటంటే, ఇంకా కథ నెరేట్ చేయలేదని. అంటే కాన్సెప్ట్, క్యారెక్టర్లు అనుకుని, కథ వండుతున్నారా అన్నది టాలీవుడ్ వర్గాల అనుమానం. 

Show comments