నాగ్ - చందు కథ సెట్ కావడం లేదా?

ప్రేమమ్ హిట్ తరువాత నాగ్ పిలిచి మరీ సినిమా చాన్స్ ఇచ్చేసాడు దర్శకుడు చందు మొండేటికి.  ఆ మేరకు చందు కూడా రెండు స్క్రిప్ట్ లు వినిపించేసాడు నాగ్ కు. అందులో ఒకటి భలేగా నచ్చింది నాగ్ కు. ఈ స్క్రిప్ట్ కు ఓ యంగ్ హీరో కావాల్సి వుండడంతో నిఖిల్ ను ఛూజ్ చేసుకున్నారు కూడా. అయితే అక్కడి నుంచి మరి ముందుకు వెళ్లడం లేదు వ్యవహారం.

స్క్రిప్ట్ సెకండాఫ్ ఫైనల్ కాకపోవడమే కారణం అని తెలుస్తోంది. స్క్రిప్ట్ లైన్ ఓకె కానీ, టోటల్ గా ఇంకా ఫెర్ ఫెక్ట్ గా రావాలని నాగ్ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పటి వరకు ఈ ఫ్రాజెక్టు్ ఫైనల్ కాలేదని వినికిడి. ప్రస్తుతం నాగ్ తన రాజుగారి గది 2 సినిమా పై వున్నారు. అదయ్యాక అఖిల్ పెళ్లిపనులు వగైరా వుండనే వున్నాయి.

అందువల్ల అంత అర్జెన్సీ కనిపించడంలేదు. ఈ లోగా చందు మొండేటి స్క్రిప్ట్ ను నాగ్ కు నచ్చేలా తయారుచేసే పనిలో పడ్డారు. అది సెట్ అయితేనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. కానీ ఈ లోగా నిఖిల్ మరో సినిమా మీదకు వెళ్లకుండా వుండాలి. నిఖిల్ ఇప్పుడు చేస్తున్న కేశవ దాదాపు పూర్తి కావచ్చింది. దీని తరువాత ఓ ప్రాజెక్టు డిస్కషన్ లో వుంది. కానీ నాగ్ సినిమా సంగతి తేలితే కానీ, నిఖిల్ కూడా ఏ ప్రాజెక్టు టేకప్ చేయలేడేమో?

Show comments