తండ్రి పాత్రలో బన్నీ

బన్నీ ది చాలా వెల్ ప్లాన్డ్ వ్యవహారం. స్టెప్ బై స్టెప్ వెళ్తుంటాడు. ఇన్నాళ్లు హీరోగా నిలదొక్కుుంటూ వెళ్లాడు. మధ్యలో ప్రకటనలు చేసాడు. ఇప్పుడు మెల్లగా బిజినెస్ లోకి దిగాడు. నిమ్మగడ్డ ప్రసాద్ అంటే పక్కన్నేను అన్నట్లు వుంటారు నాగార్జునతో పాటు అల్లు అరవింద్ కూడా. అలాంటిది తొలిసారి అరవింద్ బదులు బన్నీ జాయిన్ అయ్యాడు. సచిన్, నిమ్మగడ్డ తదితరులు కలిసి చేస్తున్న బాడ్మింటన్ టీమ్ బిజినెస్ లో అరవింద్ బదులు బన్నీ చేరాడు. 

గతంలో నిమ్మగడ్డ, సచిన్, పివిపి, నాగ్ కలిపి ఇదే తరహా ముంబాయ్ టీమ్ ను తీసుకున్న సంగతి గుర్తుండే వుంటుంది. అల్లు వారి బిజినెస్ లు అన్నీ అరవింద్ గారి సారధ్యంలోనే సాగుతాయి. చెన్నయ్ నుంచి హైదరాబాద్ మీదుగా బెంగళూరు వరకు. అది జ్ఞాన్ వేల్ రాజాతో అయినా, యువి క్రియేషన్స్ అయినా, రాక్ లైన్ వెంకటేష్ అయినా ఇప్పుడు తొలిసారి బన్నీ వచ్చాడు. 

అరవింద్ బదులుగా..మిగిలిన వారు సేమ్ టు సేమ్..ఇప్పటికే తెరవెనుక తన సినిమా ప్రాజెక్టుల ఆద్యంతం ఇన్ వాల్వ్ అయి చేసుకుంటున్నాడు. ఇప్పుడు బిజినెస్ లు కూడా అన్నమాట. 

Show comments