ట్విట్టర్ అన్ లాక్..రానా త్రిష కిస్ లాక్

గాయని సుచిత్రా కార్తీక్ ట్విట్టర్ వ్యవహారం కోలీవుడ్ లో హాట్ హాట్ గా మారుతోంది. ఆమె ట్విట్టర్ అక్కౌంట్ ను హ్యాక్ చేసి పోస్ట్ చేసిన ఫొటోలు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మిగిలిన ఫొటొలు ఎలా వున్నా, మన ఘాజీ హీరో, బాహుబలి మైటీ విలన్ రానా వీర తన్మయత్వంతో తమిళ్ బ్యూటీ త్రిష బుగ్గను ముద్దాడుతున్న ఫొటో మాత్రం పిక్చర్ ఆఫ్ ది డే అన్నట్లుగా వుంది.

కేవలం సరదాకి ఫొటో తీయించుకోవడం వేరు. ఈ ఫొటో వేరు. వారిద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం వుందో, త్రిషను రానా ఎంత తన్మయత్వంతో ముద్దాడాడో ఆ ఫొటో చూస్తే అర్థమైపోతుంది. కొన్నాళ్ల క్రితం త్రిష-రానాల వ్యవహారం పెళ్లిదాకా వచ్చేసినంత హడావుడి జరిగింది. కానీ త్రిషకు వేరే ఎంగేజ్ మెంట్, క్యాన్సిల్ కూడా అయిపోయింది.

మరి అప్పటిది ఎప్పటిదో ఫోటో ఇప్పుడు బయటకు రావడం, అది కూడా సుచిత్ర కార్తీక్ ట్విట్టర్ అక్కౌంట్ లో ప్రత్యక్షం కావడం సంచలనంగా వుంది. ఇటీవల ట్విట్టర్ లో సంచలనాలు చెలరేగడం, ఆఫై తూచ్..నా ట్విట్టర్ అక్కౌంట్ హ్యాక్ చేసారహో అని అనడం కామన్ అయిపోయింది. ఇంతకీ ఈ ఆపాతమధురం లాంటి ఫొటొను మరోసారి చూసి రానా త్రిష ఎలా ఫీల్ అయి వుంటారో?

Show comments