టీడీపీ.. ఏపీలో ఈ డిమాండ్ చేయగలదా?

రెండు కళ్ల సిద్దాంతం.. దీన్ని అమలు పెట్టడంలో టీడీపీకి ఒక హద్దూపద్దు.. లేకుండాపోయింది. ఇలా మాట్లాడితే జనాలు నవ్వుకొంటారు.. అనే భావనే లేకుండా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది. తెలంగాణలో అయితే ఒక విధానం, ఆంధ్రాలో అయితే మరో మాట! ఒకవైపు మాది  జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్న తెలుగుదేశం నేతలు ఇంత కంగాళీగా ఎలా వ్యవహరిస్తారో అర్థం  కాదు. తెరపై కమేడియన్ల తీరున వ్యవహరిస్తున్నారు వీళ్లు.

తాజాగా తెలంగాణ తమ్ముళ్లు ఒక డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ విషయంలో వీరు ఈ డిమాండ్ వినిపించారు. రుణమాఫీని ఒకే దఫాలో చేయాలనేది వీరు వినిపించిన డిమాండ్. రైతు జనోద్ధరణకు ఇదే మార్గమని వీరు సెలవిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరగాలనేది వీరి డిమాండ్. ఈడిమాండ్్ లో అర్థం ఉంది. అధికారమిస్తే.. రుణ విముక్తులను చేస్తామని హామ ఇచ్చిన పార్టీలు ఆ మేరకు మాటనిలబెట్టుకోవాలి. రుణమాఫీ హామీ మీద రైతుల ఓట్లను వేయించుకున్న వాళ్లు ఆ మాఫీని వాయిదాలు వేయడం, ఐదేళ్లలో చేస్తాం.. పదేళ్లలో చేస్తాం.. అని అనడం హేయం. అధికారంలోకి వచ్చి మూడోసంవత్సరం అవుతున్నా ఈ పార్టీలు ఇప్పటి వరకూ రెండో దశ రుణమాఫీని  కూడా సరిగా చేయకపోవడం మోసం.

మరి ఈ మోసమే చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో కేసీఆర్ ఫెయిలయ్యాడు. అయితే దీని గురించి తెలుగుదేశం మాట్లాడటమే ఇక్కడ విడ్డూరం. రుణమాఫీ అమలు విషయంలో కేసీఆర్ ప్లాఫ్ అయితే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అట్టర్ ప్లాఫ్ అయ్యాడు! కేసీఆర్ రెండో విడత మాఫీకి సొమ్ముల జమ చేస్తుంటే అత్యంత సమర్థుడైన చంద్రబాబు బాండ్లు ఇస్తున్నాడు!ఈ బాండ్లను రైతులు బ్యాంకులకు తీసుకెళ్తుంటే బ్యాంకర్లు తిప్పి పంపిస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప ఈ బాండ్లను మార్చుకోవడానికి అవకాశం లేదని రైతులకు స్పష్టం చేస్తున్నాయి బ్యాంకులు. దీంతో రైతులది అగమ్యగోచరమైన పరిస్థితే అయ్యింది.

తెలంగాణలో మాత్రం బాండ్ల గోల లేదు. రైతులకు రెండో విడత సొమ్ములను జమ చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం నేతలు రుణమాఫీ విషయంలో మాట్లాడుతున్న మాటలను వింటున్న ఏపీ రైతులు నివ్వెరపోతున్నారు. ఏపీ లో రుణమాఫీ వ్యవహారం పై టీడీపీకి ఈ మాత్రం శ్రద్ధ ఉండుంటే తమ జీవితాలు బాగుపడేవని వారు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. Readmore!

Show comments

Related Stories :