పవన్ దగ్గర డబ్బుల్లేవ్‌.. ఎందుకంటే.!

'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమా ఫ్లాపయ్యిందని పవన్‌కళ్యాణ్‌ ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ వద్ద డబ్బులు లేకపోవడానికి ఆ సినిమానే కారణమట. రాజకీయాలు చేయడానికి, జనసేన పార్టీని నడపడానికీ తన వద్ద డబ్బుల్లేవని 'బీద అరుపులు అరుస్తూ' అందుక్కారణం, అభిమానులు 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాని చూడకపోవడమేనంటో 'కుళ్ళు జోకు' ఒకటి పేల్చాడు జనసేనాధిపతి. 

అన్నట్టు, 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాకి పవన్‌కళ్యాణ్‌ సగం నిర్మాత.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా. అదీ అసలు విషయం. సినిమా ఆశించిన విజయం సాధించలేకపోయినమాట వాస్తవం. అయితే, నిర్మాతగా పవన్‌కళ్యాణ్‌తోపాటు శరద్‌మరార్‌ కూడా గట్టిగానే వెనకేసుకున్నారు. కానీ, పవన్‌కళ్యాణ్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'తో ఆర్థికంగా చితికిపోయానని చెబుతున్నారు. 

అయినా పవన్‌కళ్యాణ్‌కి ఈ బీద అరుపులు కొత్తేమీ కాదు. గతంలోనూ ఇదే మాట చెప్పారాయన. గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల సమయంలోనూ 'డబ్బుల్లేవు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి..' అంటూ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. మరి, అప్పుడు పవన్‌ ఆర్థిక ఇబ్బందులకు కారణమేంటట.? ఫ్యాన్స్‌ వింటారు కాబట్టి, ఏమైనా మాట్లాడేయచ్చనుకుంటే ఎలా.?

Readmore!
Show comments

Related Stories :