సిగరెట్ కన్నా సెక్స్ ఇష్టమన్న స్టార్ హీరోయిన్!

మొత్తానికి ప్రియాంక చోప్రా ఎక్కడా తగ్గట్లేదు. మోడీ పక్కన కూర్చుని తొడలు చూపించావేంటి? అని నెటిజన్లు అడిగితే, తన తొడలు మాత్రమే గాక తన తల్లి తొడలు చూపిస్తూ ఫొటోను పోస్టు చేసి సమాధానం ఇచ్చింది. తొడలు కూడా శరీర భాగాలే.. అంతకు మించి ఆలోచించొద్దు అంటూ కౌంటర్ ఇచ్చింది ప్రియాంక.

మరి అదే అనుకుంటే.. ఈమె అమెరికన్ టీవీ షోల్లో చేస్తున్న వ్యాఖ్యానాలు ఇండియా పాలిట బోల్డ్ గా, సంచలనంగా మారుతున్నాయి. హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బికినీ పోజులు, బీచ్ వెకేషన్లతో ఇండియన్స్ నోళ్లలో నీళ్లను ఊరిస్తున్న ప్రియాంక.. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

సిగరెట్ స్మోకింగ్ ను వ్యతిరేకించిన ప్రియాంక.. ఆ విషయాన్ని చాలా సెక్సీ గా చెప్పింది. ఇంతకూ ప్రియాంక ఏమందంటే.. సిగరెట్ తాగడం కన్నా సెక్స్ ఎంజాయ్ మెంటే బెటర్ అని! తనకు సిగరెట్ అంటే అసహ్యం అని, సిగరెట్ - సెక్స్ లలో దేనికి ప్రాధాన్యతను ఇస్తావు? అంటే తను సెక్స్ నే ఎంచుకుంటాను అని ప్రియాంక చాలా సెక్సీగా చెప్పింది.

ఒక సిగరెట్ తాగడం కన్నా ఒక సారి సెక్స్ ను ఆస్వాదించడమే మేలని ప్రియాంక తేల్చి చెప్పింది. మరి ఈ అందాల భామ కామెంట్ ను సిగరెట్ తాగే జనాలు గమనించుకోవాలి. సిగరెట్ తాగి ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు.. సెక్స్ తో అంతకు మించిన ఆనందం ఉంటుంది.. అని భరోసా ఇస్తోంది. మరి సిగరెట్ ను మాన్పించడానికి ఇంతకు మించిన, గొప్ప సూచన ఏదైనా ఉందా? ఎవరైనా ఇవ్వగలరా?

Show comments