వినాయక్ కు కథలు కావలెను

దర్శకుడు వివి వినాయక్ సూపర్ గా మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్. అతని కెరీర్ లో ఫెయిల్యూర్స్ తక్కువ. పది కోట్ల రేంజ్ రెమ్యూనిరేషన్ తీసుకునే దర్శకుడు. కానీ ఒకటే మైనస్ పాయింట్. ఆయన కథకుడు కాదు. కనీసం లైన్ లు కూడా ఆయన సెట్ చేసుకోడు.

అఖిల్ సినిమాతో ట్రాక్ తప్పిన వినాయక్ కెరీర్ ఖైదీ 150 సినిమాతో మళ్లీ లైన్ లో పడింది. సాయిధరమ్ తేజ, ఎన్టీఆర్, బాలయ్య ఈ ముగ్గురూ వినాయక్ తో సినిమాలు చేయడానికి రెడీగా వున్నారు. కానీ..కానీ ఒకటే సమస్య కథలు కావాలి.

వినాయక్ ఇప్పుడు అదే వేటలో వున్నారు. ఎవరి దగ్గరన్నా ఈ ముగ్గురిలో ఎవరికి సూటయ్యే కథన్నా వుంటే కావాలి అని తెగ వేటాడేస్తున్నారట. అప్ కమింగ్ లేదా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న రైటర్లను, ఇండస్ట్రీలో తనకు పరిచయం వున్న వారిలో కొందరిని ఈ మేరకు వినాయక్ ఎంక్వయిరీ చేస్తున్నారట. మీ దృష్టిలో ఏదన్నా మంచి సబ్జెక్ట్ వుంటే చెప్పండి బాలయ్యకైనా, సాయి కైనా, ఎన్టీఆర్ కైనా అని అడుగుతున్నారట. 

ఆ రేంజ్ డైరక్టర్ ఆ రేంజ్ లో ఎంక్వయిరీ స్టార్ట్ చేసారు కాబట్టి, తప్పకుండా దొరికేస్తుంది. డవుటే లేదు. అవును ఇంతకీ వినాయక్ ఆస్థాన రచయిత ఆకుల శివ సంగతేమిటి? వినాయక్ కు సరిపడా కథ అందించలేకపోతున్నారా?

Show comments