రెడ్‌ హాట్‌ డేంజరస్‌ దీపిక.!


హాలీవుడ్‌కి వెళ్ళింది కదా.. ఆ మాత్రం హాట్‌ అప్పీల్‌ వుండాల్సిందే. అయితే, ఎప్పుడూ ఏ ఫంక్షన్‌కి హాజరైనా అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకునేలా డ్రెస్సింగ్‌ చేసుకునే దీపికా పడుకొనే.. ఇప్పుడెందుకో, అంతా తనగురించే మాట్లాడుకునేలా చేసింది. ఆ మాటలు కూడా, 'అద్భుతహ' అనేలా కాకుండా, 'షాకింగ్‌ దీపిక.. ఇలా చేసిందేంటబ్బా.?' అనుకునేలా చేయడమే ఇక్కడి విశేషం. 

బాలీవుడ్‌లో అద్భుతమైన గ్లామర్‌కీ, అతి చెత్త గ్లామర్‌కీ అవార్డులుంటాయి. అందుకే, ఎప్పుడూ అద్భుతంగానేనా.. అప్పుడప్పుడూ పరమ చిరాగ్గా తయారయ్యేందుకూ నటీమణులు పోటీ పడ్తుంటారేమో అన్పిస్తుంటుంది ఇలాంటప్పుడే. చెత్త నటి, చెత్త సినిమా, చెత్త నటుడు.. అంటూ గోల్డెన్‌ ఖేలా అవార్డులు బాలీవుడ్‌లో ఇస్తుంటారు. ఇప్పుడీ గోల్డెన్‌ ఖేలా చెత్త డ్రెస్సింగ్‌ కేటగిరీలో దీపికా పడుకొనేకి అవార్డ్‌ ఇవ్వాలేమో. 

ఓ అవార్డుల ఫంక్షన్‌లో దీపికా పడుకొనే.. ఇదిగో ఇలా దర్శనమిచ్చి.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితేనేం, ఇదో వెరైటీ స్టైల్‌.. అంటూ అభిమానులు సరిపెట్టుకుంటున్నారనుకోండి.. అది వేరే విషయం.

Show comments