బోయపాటి బాబు భజన

ముఖ్యమంత్రి వేదిక మీద వున్నారు అంటే, ఆహుతులు ఎవరైనా, ఆయన గురించి ఓ మంచి మాట చెప్పడం పెద్ద విడ్డూరం కాదు. కానీ సందర్భం మరచి, విషయం మరిచి కేవలం ఆయన గురించి అద్భుతాలు మాటల్లో ఫొదిగి మాట్లాడడం అంటే కాస్త ఆలోచించాల్సిందే. తిరుపతిలో జరిగిన గౌతమీ పుత్ర శాతకర్ణి సభలో దర్శకుడు బోయపాటి శ్రీను ఆ గీత దాటేసి మరీ చెడుగుడు ఆడేసారు.

భగవంతుడు ఎవరు ఈ రాష్ట్రానికి సరైన రాజధానిని నిర్మించగల సత్తా వున్నవారు, అనుభవం వున్నారు, సామర్థ్యం వున్నవారు అన్నది గమనించి స్వయంగా ఎంపిక చేసి, ఎన్నుకున్నారు నారా చంద్రబాబు నాయుడిని...అంటూ ఆకాశానికి ఎత్తేసారు. ఎన్నికల ముందు చంద్రబాబా? జగన్ నా? అంటే అనుభవం కావాలి అంటూ జగన్ ను వెనక్కు నెట్టే ప్రయత్నం చేసింది ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ప్రచారం.

Click Here For Audio Function Photo Gallery

ఇప్పుడు బోయపాటి మరో అడుగు ముందుకు వేసి, ఆ అనుభవం చూసి, ఓటర్లు కాదు ఏకంగా భగవంతుడే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని బోయపాటి ప్రశంసించారు. తన ప్రసంగంలో ఎక్కువ సమయం చంద్రబాబును పొగిడేందుకు బోయపాటి ఖర్చు చేయడం విశేషం.

Show comments