చంద్రబాబు… మరో ప్రహసనం!

చెంబుతో నీళ్లు పోసి నదుల అనుసంధానం అయిపోయిందన్నారు. అపర భగీరథుడిని తనే అని ప్రకటించుకోవడం అయ్యింది. ఆ తర్వాత అదంతా ప్రహసనం అయ్యింది. ఇక చెంబుల తర్వాత పంపుల వంతు వచ్చింది.. ఇదో ప్రహసనం!

విషయం ఏమిటంటే.. హంద్రీనీవా కలను నెరవేర్చా అని ఇటీవలే బాబు చెప్పుకున్నారు. మా నాన్న కల తీరిందని బాలయ్యబాబు చెప్పుకున్నాడు.. అద్భుతం జరిగిందని అనుకూల మీడియా రాసింది!

కట్ చేస్తే.. సినిమా సెట్టింగులా తయారైంది పరిస్థితి. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగం అయిన అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలోని గొల్లపల్లి రిజర్వాయర్ లోకి నీళ్లు రావడం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలింది. శ్రీశైలం వరద నీటి మీద ఆధారపడిన హంద్రీనీవా ప్రాజెక్టులోని ఒక ఫేస్ ను ఇటీవలే చంద్రబాబు, తెలుగుదేశం ముఖ్య నేతలు లాంఛనంగా ప్రారంభించారు.

సీమను సస్యశ్యామలం చేసేశాం అని ప్రకటించారు. బాగా హడావుడిగా ఆ కార్యక్రమాన్ని చేపట్టారు. అనుకూల మీడియా పతాక శీర్షికల్లో వార్తలు పెట్టింది. అయితే అదంతా  తొలి రోజు ముచ్చట. కాలువల నిర్మాణాలు అరకొరగా పూర్తి చేసి.. హడావుడిగా ప్రారంభోత్సవాన్ని చేసేశారు. అంతా అయిపోయిందని ప్రకటించారు. Readmore!

అయితే అసలు కథ అక్కడే ఆరంభం అయ్యింది. సరిగ్గా కాలువలు సాగి, రిజర్వాయర్ లోకి నీళ్లు ప్రవేశించకుండానే ప్రవాహం ఆగిపోయింది! కనీసం రిజర్వాయర్ సగం టీఎంసీ నీళ్లు చేరకుండానే.. నీటి సరఫరాను ఆపేశారు! అదేమంటే.. ఎగువ రిజర్వాయర్ లో నీళ్లు లేవు, కాలువల పనులు ఇంకా పూర్తి కాలేదు.. అనే మాటలు చెబుతున్నారు. దీన్ని ఏమనాలో సామాన్య మానవుడికి అయితే అర్థం కాదు!

వైఎస్ హయాంలో మెజారిటీ నిర్మాణంపూర్తి అయిన హంద్రీనీవాకు సంబంధించిన క్రెడిట్ ను సొంతం చేసుకోవడానికి తెలుగుదేశం వాళ్లు ప్రయత్నించారు. చేస్తే చేశారు.. కనీసం నీళ్లైనా ఇచ్చారా? అంటే.. అదేం లేదు. రెండ్రోజులు పంపులతో నీళ్లు కొట్టించి.. సీమ సస్యశ్యామలం అయిపోయిందని ప్రకటించారు! ఇక మళ్లీ అతీగతీ లేదు.

చంద్రబాబు ప్రారంభోత్సవం చేసిన గొల్లపల్లి రిజర్వాయర్ కామెడీ అలా ఉంటే.. ఆ తర్వాతి ఫేస్ గురించి కామెడీ చేస్తున్నాడు మంత్రి పల్లె రఘునాథరెడ్డి. గొల్లపల్లి రిజర్వాయర్ నిండితే.. దాన్నుంచి నీళ్లు వదిలితే.. పుట్టపర్తి నియోజకవర్గం గుండా పోయే కాలువ ద్వారా నీళ్లు పోతాయి. అయితే.. ఈ కాలువ నిర్మాణంలో కొంత  పెండింగ్ పని ఉంది. రెండున్నర సంవత్సరం నుంచి అయినా ఆ పనులు పూర్తి చేయలేకపోతున్నారు. అయితే.. నీళ్లు వచ్చేస్తున్నాయి.. అంటూ పల్లె రఘునాథరెడ్డి కామెడీ చేస్తున్నాడు. గొల్లపల్లికే గతి లేకపోయినా.. ఆ తర్వాతి ఫేస్ గురించి ఈయన కబుర్లు చెప్పుకుతిరుగుతున్నారు!

Show comments