రాశీ ఖన్నా ఈ మధ్య గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి.. తొలి సినిమా దగ్గర్నుంచీ రాశి ఖన్నా గ్లామర్‌లో ఏమాత్రం తగ్గలేదు. తొలి సినిమా 'ఊహలు గుసగుసలాడే' సినిమాలో తన పాత్ర స్వభావం మరీ మోడ్రన్ కాకపోవడంతో, గ్లామర్ వైపు పరుగులు పెట్టలేదుగానీ, దాదాపుగా ఆమె నటించిన సినిమాలన్నిటితోనూ గ్లామర్ విందు చేసేసింది.
ఇక, చేసిన సినిమాల్లో రాశి ఖన్నా ఐటమ్ సాంగుల్ని తలపించేలా అందాల ప్రదర్శన చేసిందన్నది నిర్వివాదాంశం. అయినాసరే, ఐటమ్ సాంగ్స్ తనకు సరిపడవని చెబుతోంది రాశి ఖన్నా. ట్విస్ట్ ఏంటంటే, ఐటమ్ సాంగ్స్ చేయబోనని తాను చెప్పడంలేదనీ, అవకాశం వస్తే మాత్రం చేస్తాననీ అంటోంది. ఇదేం ఝలక్.? అనుకుంటున్నారా.? అదేంతే, హీరోయిన్ల మాటలకు అర్థాలు వేరులే.. అనుకోవాలి.
తాజాగా 'హైపర్' సినిమాలో రాశి ఖన్నా హైపర్ గ్లామర్‌తోనే రెచ్చిపోయింది. ఐటమ్ సాంగ్‌ని మించి గ్లామర్ పండించేసింది. స్పెషల్ సాంగ్.. అంటూ కొత్త పేరు పెట్టేసి, రాశి ఖన్నా ముందు ముందు ఐటమ్ సాంగ్స్‌లో చిందేసేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే, డాన్సుల్లో కొంచెం వీక్ గనుక, బహుశా ఆ ఉద్దేశ్యంతోనే ఐటమ్ సాంగ్ తనకు సరిపడవని ఆమె చెబుతోందనుకోవాలేమో.!