దిల్ రాజు స్టూడెంట్ ఫ్యామిలీ మూవీ

దిల్ రాజు అంటే ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరు కదా? ఆయన దగ్గర సుకుమార్, బొమ్మరిల్లు భాస్కర్, ఇంకా అనేకమంది డైరక్టర్లు మంచి ఫ్యామిలీ సినిమాలు తీసారు. ఇలా తీసిన సినిమాలన్నింటికీ పని చేసిన అసోసియేట్ సుందర్ ఓ మంచి ఫ్యామిలీ కథ తయారు చేసాడట. అమ్మమ్మ ఇల్లు అనే టైటిల్ తో. ఈ కథకు ఎవరు దొరుకుతారా అని వెదుకుంటే మంచి సౌండ్ పార్టీ ఒకటి కొత్తగా నిర్మాణ రంగంలోకి భారీ ఎత్తున దిగాలని వచ్చింది. దాంతో ఇప్పుడు ఆ సినిమా సెట్ అయిపోయింది. నాగశౌర్య హీరోగా ఈ సినిమాను వచ్చే నెల నుంచి తెరకెక్కించనున్నారు. 

ఈ కొత్త నిర్మాతలు మైత్రీ మూవీస్ మాదిరిగా సినిమా రంగంలో వీలయినంత మంది హీరోలతో సినిమాలు చేయాలని ప్లాన్ తో వుందట. కొత్త పార్టీ కాస్త బలంగా వస్తోందని తెలిసి, అప్పడే ఓ సూపర్ స్టార్ట్ తో భారీ సినిమా త్వరలో ప్రారంభించే నిర్మాత ఫైనాన్స్ కోసం వెళ్లారట. కానీ ఫైనాన్స్ కాదు, నిర్మాణాలు, భాగస్వామ్యం కోసం చూస్తున్నామన్నారట సదరు పార్టీ. ఆ మాట అలా వుంచితే, ఇన్నాళ్లకు గట్టి నిర్మాతతో మంచి సబ్జెక్ట్ తో కొత్త డైరక్టర్ తో మరో సినిమా దొరికిందని నాగశౌర్య హ్యాపీగా వున్నాడట. ఆల్రెడీ ఓ కొత్త దర్ళకుడితో స్వంత బ్యానర్ లో సినిమా చేస్తున్నడు కూడా.

Show comments