పిక్‌ టాక్‌: రెడ్‌ హాట్‌ బికినీలో స్నేహ

స్నేహ అంటే, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన సీనియర్‌ హీరోయిన్‌ స్నేహ కాదు. ఈ స్నేహ వేరు. జూనియర్‌ ఐష్‌గా బాలీవుడ్‌లో గుర్తింపు పొంది, సౌత్‌లోనూ చాలా సినిమాల్లో నటించిన స్నేహా ఉల్లాల్‌, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఫొటో ఇది. రెడ్‌ హాట్‌ బికినీలో స్నేహా ఉల్లాల్‌ కెవ్వు కేక అనేలా గ్లామర్‌ ఒలకబోసేసింది. అఫ్‌కోర్స్‌.. ఈ తరహా గ్లామర్‌ ఆమెకి కొత్త కాదనుకోండి.. అది వేరే విషయం. 

ఇక, స్నేహా ఉల్లాల్‌ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో అంత యాక్టివ్‌గా ఏమీ లేదు. బాలకృష్ణతో 'సింహా' సినిమాలో నటించినా, స్నేహా ఉల్లాల్‌ దశ తిరగలేదు. 'ఏం చేస్తాం, లక్‌ కలిసి రావాలి.. అయినా, హీరోయిన్‌గా ఇప్పుడీ స్థాయిలో వున్నానంటే చిన్న విషయం కాదు..' అంటూ తనకు తానే సర్దిచెప్పేసుకుంటోంది స్నేహా ఉల్లాల్‌. సౌత్‌తోపాటు, బాలీవుడ్‌ సినిమాలకీ దగ్గరగానే వుందట ఈ బ్యూటీ. 

ఒకప్పుడు మ్యాగజైన్‌ కవర్‌ పేజీ మీద హాట్‌ ఫొటోల కోసం పోటీ వుండేదనీ, ఇప్పుడు సోషల్‌ మీడియా వచ్చాక.. కొత్త ట్రెండ్‌ ప్రారంభమయ్యిందనీ చెబుతోన్న స్నేహా ఉల్లాల్‌, సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా వుండడంతోపాటు, టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడాల్లేకుండా అన్ని సినీ పరిశ్రమలకీ అందుబాటులో వుండే అవకాశమొచ్చిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Show comments