నరసింహన్ చూపు ఆ రాష్ట్రం వైపు!

గవర్నర్ నరసింహన్ 2009 నుంచి ఆ పదవిలో ఉన్నారు. 2015 మే కేంద్రం ఆయన పదవిని రెండేళ్లపాటు పొడిగించింది. కాంగ్రెస్ హయాంలో నియమించిన గవర్నర్లందరూ ఇంటి దారి పట్టినా నరసింహన్ మాత్రం అలాగే కొనసాగుతున్నాడు. చంద్రబాబు నాయుడు తీసేయమన్నా కేంద్రం తీసేయలేదు.

 కేసీఆర్ బలహీనతలను ఆసరాగా తీసుకుని నరసింహన్ ఆయనను తన చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇప్పుడు 2017 మేలో ఆయన పదవీకాలం పూర్తవుతుంది. ఈలోపు ఏ విధంగానైనా మరో రాష్ట్రానికి గవర్నర్గా వెళ్లి మరో ఆరేళ్లు కొనసాగుదామని ఆయన ఆశపడుతున్నారు.

 తమిళనాడు గవర్నర్గా రోశయ్య పదవీ విరమణ చేసినప్పటినుంచీ తమిళనాడుపై నరసింహన్ కన్ను పడింది. నేనే ఉంటే తమిళనాడు వ్యవహారాలను చక్కదిద్ది మోడీకి ఎంతో సహాయపడతాను.. అని చెప్పుకుంటున్నారట. ఏడుపదులు దాటినా ఆయన ఆశకు అంతులేదు.

Show comments