ఓవర్సీస్‌ మార్కెట్‌లో టాలీవుడ్‌ దే హవా

ఓవర్సీస్‌ (ఉత్తర అమెరికా బాక్సాఫీస్‌) మార్కెట్‌లో ఈ ఏడాది టాలీవుడ్‌ డామినేషన్‌ స్పష్టంగా కనిపించింది. తెలుగు సినిమా మార్కెట్‌ వాల్యూ పరభాషా చిత్రాలకు తెలిసొచ్చింది. ఏకంగా బాలీవుడ్‌ సినిమానే బీట్‌ చేసే స్థాయికి ఎదిగింది టాలీవుడ్‌. అమెరికా బాక్సాఫీస్‌లో షారూక్‌, సల్మాన్‌ సినిమాల కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

మరీ ముఖ్యంగా బాహుబలి-2 రాకతో ఈ తేడా స్పష్టంగా కనిపించింది. ఓవర్సీస్‌లో బాహుబలి-2 సినిమా ఆల్‌ టైం హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు 20 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వస్తే, షారూక్‌ నటించిన రాయీస్‌ సినిమాకు 3.63మిలియన్‌ డాలర్ల వసూళ్లు మాత్రమే వచ్చాయి.

అమెరికా మార్కెట్లో అత్యథిక వసూళ్లు సాధించిన టాప్‌-10 ఇండియన్‌ సినిమాల్లో షారూక్‌ ఖాన్‌ మూవీ రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. లిస్ట్‌లో డామినేషన్‌ మాత్రం టాలీవుడ్‌ దే. ఎక్కువ చిత్రాలు తెలుగు సినిమాలే. లిస్ట్‌లో తమిళ సినిమాకు అస్సలు స్థానం దక్కలేదు.

ఇక టాలీవుడ్‌-బాలీవుడ్‌ మూవీస్‌ కంపేరిజన్‌కు వస్తే.. వరుణ్‌తేజ్‌ నటించిన ఫిదా సినిమా.. అక్షయ్‌, సల్మాన్‌ సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. అమెరికాలో తెలుగు ప్రేక్షకులదే హవా. దీంతో బాహుబలి-2, ఖైదీ నంబర్‌-150, ఫిదా, గౌతమిపుత్ర శాతకర్ణి, కాటమరాయుడు సినిమాలు టాప్‌ గ్రాసర్స్‌గా నిలిచాయి.

బాలీవుడ్‌ నుంచి రయీస్‌, బద్రినాథ్‌కి దుల్హనియా, జాలీ ఎల్‌ఎల్‌బి-2, ట్యూబ్‌లైట్‌, కాబిల్‌ సినిమాలు మాత్రమే టాప్‌-10 లిస్ట్‌లో నిలిచాయి. శేఖర్‌ కమ్ముల డైరక్ట్‌ చేసిన ఫిదా సినిమా 2 మిలియన్‌ డాలర్‌ మార్క్‌ అందుకునేందుకు రెడీగా ఉంది. రాబోయే రోజుల్లో మహేష్‌ బాబు స్పైడర్‌, నితిన్‌ లైతో పాటు మరికొన్ని తెలుగు సినిమాలు ఈ లెక్కల్ని మరింత సవరించబోతున్నాయి. సో.. ఓవర్సీస్‌లో టోటల్‌ డామినేషన్‌ టాలీవుడ్‌ దే.

బాహుబలి-2     - 20,571,695 డాలర్లు

రయీస్‌             -  3,633,008 డాలర్లు

ఖైదీ నంబర్‌-150 - 2,447,043 డాలర్లు

బద్రినాథ్‌ కి దుల్హనియా -  1,975,957 డాలర్లు

ఫిదా      - 1,728,738 డాలర్లు

జాలీ ఎల్‌ఎల్బీ 2     - 1,687,530 డాలర్లు

గౌతమిపుత్ర శాతకర్ణి   - 1,662,775 డాలర్లు

ట్యూబ్‌లైట్‌   - 1,576,244 డాలర్లు

కాబిల్‌    - 1,417,646 డాలర్లు

కాటమరాయుడు   - 1,162,059 డాలర్లు

Show comments