కల్వకుంట్ల వారు ఆదేశిస్తారు.. నారా వారు పాటిస్తారు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు ఎలాంటి ద్రోహాలు చేస్తున్నాడో.. తాను చేసిన పాపాల ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలను ఏ రకంగా తాకట్టు పెట్టేస్తున్నాడో జనం ఒక్కటొక్కటిగా గమనిస్తూనే ఉన్నారు. ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబునాయుడు.. ఆ డీల్ కుదుర్చుకున్న నాటినుంచి పొరుగు రాష్ట్రం కేసీఆర్ తో కూడా సామరస్యంగా ఉంటూ పనులు చక్కబెట్టుకుందాం అనే నీతిని ఎంత తరచుగా వినిపిస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. పాలకుడు తప్పు చేసినందువల్ల రాష్ట్రం మొత్తం ఎంత నష్టపోతున్నదో వారికి అర్థమవుతూనే ఉంది. 

ఇప్పటికే కేంద్రం పాదాల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పాపానికి ప్రత్యేకహోదాను అన్నీ చేజేతులా మంటగలిపేసిన చంద్రబాబునాయుడు... విభజన చట్టంలోని 9, 10 షెడ్యూళ్ల ఆస్తులను వాటాల ప్రకారం వేగంగా పంచుకుని.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే విషయంలో కూడా మరో మోసానికి పాల్పడుతున్నట్లుగా కనిపిస్తోంది. రకరకాల కారణాల నేపథ్యంలో కేసీఆర్ వలన ఎలాంటి అన్యాయం జరిగినా సరే ఎదురు ప్రశ్నించలేదని స్థితిలో ఉన్న చంద్రబాబు అచేతనత్వానికి ఇది పరాకాష్టగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి, కల్వకుంట్ల వారు ఎలా ఆదేశిస్తే అలా నారా వారు నడుచుకునేలా ఉన్నది. 

సెక్రటేరియేట్ భవనాల విషయానికే వస్తే.. ఏపీ సెక్రటేరియేట్ భవనాలు అన్నీ వెంటనే తమకు తక్షణం అప్పగించాలంటూ కేసీఆర్ సర్కారు ఓ విజ్ఞాపన లాంటి హుకుం జారీ చేసింది. కేబినెట్ లో చర్చించేసి.. ఆ విషయాన్ని గవర్నరుకు కూడా నివేదించింది. చంద్రబాబునాయుడు ఓ పాలిట్ బ్యూరో మీటింగ్ పెట్టి (అందరూ దయతో గమనించవలెను.. కేసీఆర్ కేబినెట్ మీటింగ్ పెట్టి తీసుకుందాం అని డిసైడ్ చేస్తే.. చంద్రబాబు పాలిట్ బ్యూరోర మీటింగ్ పెట్టారు) ఇచ్చేద్దాం అని డిసైడ్ చేశారు. అయితే ఇక్కడ రాష్ట్రానికి జరుగుతున్న నష్టం ఏంటంటే.. ఉమ్మడి తెలుగు రాష్ట్రం నుంచి ఏపీకి రావాల్సిన ఆస్తుల పంపకాల వాటా ఇంకా తేలనే లేదు. 

సచివాలయ  భవనాలను పదేళ్లపాటు వాడుకోవడానికి ఏపీ సర్కారుకు చట్టబద్ధమైన అధికారం ఉంది. ఆస్తుల వాటాలు తేల్చాలని ఏపీ ఎన్నిసార్లు అడుగుతున్నా.. తెలంగాణ పట్టించుకోవడం లేదు. సచివాలయ భవనాలు అప్పగించడం అనే అంశాన్ని ముడిపెట్టి.. మొత్తం ఆస్తుల పంపకాలు తేల్చేస్తే.. ఇవి కూడా ఇచ్చేస్తాం అని లింకు పెడితే గనుక.. అంతా సెటిలైపోయి.. రాష్ట్రానికి దక్కవలసినదంతా తేలిపోయే అవకాశం ఉంది. 

అయితే చంద్రబాబునాయుడుకు అలా అడిగేంత ధైర్యం ఉందా? ఎంతమాత్రమూ కనిపించడంలేదు. కల్వకుంట్ల వారు ఎప్పుడెప్పుడు ఆదేశిస్తారా? సచివాలయ భవనాలను తిరిగి ఇచ్చేద్దామా? అని ఎదురుచూస్తున్నట్లుగా.. చంద్రబాబు తిరిగి అప్పగించేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను వెంటనే తిరిగి ఇచ్చేస్తే.. 

ఇక ఆస్తుల పంపకం, 9, 10 షెడ్యూలులోని పంపకాలు కొన్ని దశాబ్దాలు గడచినా ఒక కొలిక్కి రావని.. అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. కానీ ఈ సంగతి తనకు తెలియనట్లుగా నటిస్తూ చంద్రబాబు పాలన సాగిస్తున్నారనేది జనంలోని విమర్శ. కేసీఆర్ పాదాల వద్ద ఏపీ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి.. తాను కేసులనుంచి సేఫ్‌గా ఉంటూ.. చంద్రబాబు పాలన సాగిస్తున్నారనడానికి ఇదే నిదర్శనం అని పలువురు విమర్శిస్తున్నారు. 

Show comments