సాయి కొర్రపాటికి ఎంత ధైర్యమో?

టాలీవుడ్ లో సినిమా నిర్మాణంలో కన్నా ఎక్కువ రిస్క్ వుండేది డిస్ట్రిబ్యూషన్ లోనే. ఎంతో మంది నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగి ఇబ్బందులు పడ్డారు. కొన్ని బ్యానర్లయితే కనుమరుగు అయిపోయాయి.  

డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి వచ్చి నిర్మాతగా మారారు సాయి కొర్రపాటి. నిర్మాతగా చిన్న పెద్ద దెబ్బలు తిన్నా కూడా, డిస్ట్రిబ్యూషన్ రంగం నుంచి మాత్రం వెనకడగు వేయడం లేదు. బాహుబలి పార్ట్ వన్ ను కొన్ని ఏరియాలకు కొని మంచి లాభాలు సంపాదించిన సాయి, ఇప్పుడు బాహుబలి 2 మీద కాస్త గట్టి పందెమే కాస్తున్నారు.

ఇప్పటికే ఆయన మూడు ఏరియాల హక్కులు తీసుకున్నారు. ఉత్తరాంధ్రను 13.20 కోట్లకు, కృష్ణ జిల్లాకు 9 కోట్లకు, సీడెడ్ 27 కోట్లకు ఆయన హక్కులు తీసుకున్నారు. ఇవి కాక కర్ణాటక బేరాలు సాగుతున్నాయి. అంటే బాహుబలి 2 మీద సాయి కొర్రపాటి బెట్టింగ్ దాదాపు యాభై కోట్లు ఇప్పటికి. కర్ణాటక ఏడ్ అయితే మరింత పెరుగుతుంది. నిజంగా ఇది కాస్త గుండె ధైర్యం వుండాల్సిన వ్యవహారమే.

Show comments