తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి-2 ఫస్ట్ డే వసూళ్లు

కనివినీ ఎరుగని రీతిలో విడుదలైన బాహుబలి-2 సినిమా ఊహించినట్టుగానే పాత రికార్డుల్ని తిరగరాస్తోంది. వసూళ్లలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. మొదటి రోజే వంద కోట్ల రూపాయల నెట్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించిన ఈ సినిమా... తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 42 కోట్ల 43 లక్షల రూపాయల షేర్ సాధించింది. 

మేజర్ షేర్ వచ్చిన ప్రాంతాల్ని పరిశీలిస్తే.. ఎప్పట్లానే నైజాం ఏరియాలో బాహుబలి-2 అత్యథిక వసూళ్లు సాధించింది. గురువారం ప్రీమియర్స్ తో పాటు శుక్రవారం అన్ని షోల వసూళ్లను కలుపుకుంటే ఈ సినిమాకు ఏకంగా 9కోట్ల 30లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇప్పటివరకు నైజాంలో ఇదే అత్యథికం.

ఇక సీడెడె, వెస్ట్, గుంటూరు ప్రాంతాల నుంచి అటుఇటుగా చెరో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది బాహుబలి-2 సినిమా. ఈ 3 ప్రాంతాల నుంచే ఈ సినిమాకు దాదాపు 18 కోట్ల 30 లక్షల రూపాయలు వచ్చాయి.

ఆంధ్రప్రదేశ్ లో బాహుబలి-2 సినిమా ప్రదర్శనకు ఏకంగా రోజుకు 6 షోలకు అనుమతినిచ్చారు. తెలంగాణలో రోజుకు 5 షోలు వేసుకునేందుకు పర్మిషన్ వచ్చింది. దీనికి తోడు రెండు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరల్ని దాదాపు 70శాతం పెంచేశారు. దీంతో బాహుబలి-2 సినిమాకు మొదటి రోజే కళ్లుచెదిరే కలెక్షన్లు వచ్చాయి.

Show comments