పిక్‌ టాక్‌: సముద్రంలో చేప 'పిల్ల'

సముద్రంలో చేప పిల్లలా తేలియాడుతున్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా.? అల్లరి నరేష్‌తో 'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం', 'సుప్రభాతం' సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ మంజరి ఫడ్నిస్‌. తెలుగులోనే 'ఇంకోసారి' అనే సినిమాలోనూ నటించిందిగానీ, హీరోయిన్‌గా టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ఆ తర్వాత మలయాళ సినీ పరిశ్రమలోకీ వెళ్ళిందీ భామ. 

ప్రస్తుతం హిందీలో ఒకటీ అరా సినిమాల్లో నటిస్తోన్న మంజరి ఫడ్నిస్‌, తాజాగా సీచెల్స్‌లో బీచ్‌ అందాల్ని ఎంజాయ్‌ చేసొచ్చింది. ఆ ఎంజాయ్‌మెంట్‌ని ఇదిగో, ఇలా ఫొటోల ద్వారా అభిమానులతో పంచుకుంటోంది. బాలీవుడ్‌ తారలకి హాలీడే ట్రిప్‌ అంటే మాల్దీవ్స్‌ కేరాఫ్‌ అడ్రస్‌. మాల్దీవ్స్‌లో ఎంజాయ్‌మెంట్‌ సంగతెలా వున్నా, అక్కడ విచ్చలవిడిగా బికినీలతో అందాలు ఆరబోసేసి, వాటిని సోషల్‌ మీడియాకి ఎక్కించేసి తమ ఫాలోయింగ్‌ని పెంచుకోవడం ట్రెండీగా మారిపోయింది. 

మంజరి ఫడ్నిస్‌ కూడా అదే బాటలో, సీచెల్స్‌ బీచ్‌లలో తన బికినీ అందాలతో సోషల్‌ మీడియాని వేడెక్కించే ప్రయత్నం చేసింది. తొలి తెలుగు సినిమా 'సిద్దు ఫ్రమ్‌ శ్రీకాకుళం'లోనే అందాల విందుతో కేక పెట్టించినా.. హీరోయిన్‌గా నిలదొక్కుకోలేకపోయిన ఈ బ్యూటీ, ఈ బికినీ ఫొటోలతో ఫాలోయింగ్‌ పెంచుకుంటుందా.? మళ్ళీ హీరోయిన్‌గా ఛాన్సులు దక్కించుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

Show comments