కొత్త నోట్లు గురూ: తేడాలు గుర్తించండి, తరించండి!

ఒకవేళ రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్తే, మోడీ భక్తులు గమనిస్తే.. ఈ నోట్లన్నింటికీ ఎడమ వైపున ఒకే నంబర్ ఉండటం, ఒకే నోటుకు రెండు రకాల నంబర్లు ఉండటం గురించి ఏదైనా బ్రహ్మాండమైన లాజిక్ చెబుతారు. దాంతో అందరి తలలూ తిరిగిపోతాయి! 

దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. దొంగ నోట్లు తయారు కాకుండా, నల్లధనికుల ఆట కట్టించడానికి, దేశాన్ని డిజిటల్ కరెన్సీలోకి తీసుకెళ్లడానికి… ఇలా రెండు వెయ్యి నోట్లకు ఒకే నంబర్లను ముద్రించడం జరిగిందని అంటారు! ఇంకా చెప్పాలంటే.. ఈ విధంగా ఒకే నంబర్ ను ముద్రించడం ఉగ్రవాదాన్ని అరికట్టే ఎత్తుగడ అని అనగలరు! దానికీ దీనికి ఏమైనా సంబంధం ఉందా? అంటే.. అలా అన్న వాళ్లు దేశద్రోహులే! 

ఇది లోపం కాదు, సాంకేతికంగా అలా చేయడమే రైటు అని వాదిస్తారు! ఎన్ని చూడలేదు? కొత్త రెండు వేల రూపాయల నోటుకు రంగు వెలిసిపోతోంది.. అంటే, అలా వెలిసిపోతేనే అది నిజమైన నోటు అన్నారు!

ఐదువందల నోట్లు రకరకాలుగా వచ్చాయంటే.. ఎలా వచ్చినా అవి చెల్లుతాయన్నారు! మరి ఇలా కొన్ని రెండు వేల రూపాయల నోట్లకు ఒకే నంబర్ వచ్చింది. ఒకే నోటుకు రెండు రకాల నంబర్లు రావడం ఏమిటి? ఎక్కడో మిస్టేక్ జరిగిందని కొంతమంది నెటిజన్లు దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సహజంగానే ఏదో డొల్ల వాదనను వినిపించడానికి పెద్దోళ్లూ, మోడీ భక్తులు కాచుకుని అన్నారు.

ఏ శక్తి కాంత దాసో.. ఇంకో మోడీ భక్తుడో.. ఈ సీరియల్ నంబర్ల గురించి సోది చెబుతారు, నవ్వుల పాలయ్యే వాదన వినిపిస్తారు. మిగతా భారత జనం విని తరించాలంతే!

కానీ ఈ నోట్లను చూస్తే.. కొన్ని మ్యాగ్జైన్లలో , తేడాలు గుర్తించండి.. అంటూ చిన్నపిల్లల కోసం ఇచ్చే బొమ్మలు గుర్తుకువస్తే దోషం మనది కాదు!  

Show comments