హీరోయిన్ కొడుకుకు.. ఆ రక్తపిపాసి పేరా!

సైఫ్ అలీఖాన్- కరీనా కపూర్ ఖాన్ ల తనయుడి పేరును విని చాలా మంది భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. పటౌడీ వంశీకులు తమ పిల్లాడికి పెట్టిన పేరును విని కొంతమంది విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు! పేరులో ఏముంది.. అని కొట్టిపడేసే వాళ్లు ఉండొచ్చు.. కానీ, కొన్ని కొన్ని పేర్లు వింటే దుర్మార్గానికి ప్రతీక అయిన ఇలాంటి పేర్లను కూడా పెట్టుకుంటారా? అని పిస్తుంది.

ఉదాహరణకు.. ఏ క్రిస్టియన్ అయినా ‘హిట్లర్’ అని పేరు పెట్టుకున్నారని అనుకుందాం… ఎంత ఆశ్చర్యం కలుగుతుందో.. కరీనా-సైఫ్ ల తనయుడి పేరు కూడా ఆ కోవకు చెందినదే. తైమూర్ అలీఖాన్ పటౌడీ, ఇదీ తమ గారాల బాబుకు సైఫ్ దంపతులు పెట్టుకున్న పేరు.

మరి చరిత్ర మీదే కొంచెం అవగాహన ఉన్నవారికి ఎవరికైనా, ఈ తైమూర్ అనే పేరుతో ఉన్న వాడు ఎంత దుష్టుడో తెలిసే ఉంటుంది. మంగోలియన్ జాతికి చెందిన తైమూర్ చక్రవర్తి.. ఒక మత మౌడ్యుడు. పర్షియా వైపు నుంచి భారత్ మీదకు దండెత్తిన వాడు. 14 వ శతాబ్దం చరమాంకానికి చెందిన ఈ తైమూర్.. ఎంత మతోన్మాది అంటే,  హిందువులను చంపితే అల్లా కరుణిస్తాడు అని తన ఆత్మకథలో రాసుకునేంత దుష్టుడు.

ఢిల్లీ మీదకు దండెత్తి.. ఒక్క రోజులో లక్ష మంది హిందువులను చంపినాడు. కర్కశుడు, కిరాతకుడు.. వంటివి చిన్నమాటలే అవుతాయి ఇతడి గురించి చెప్పడానికి. నేటి తరం ఐసిస్ ఉగ్రవాదుల కన్నా.. వంద రెట్లు ప్రమాదకారి తైమూర్. హిందువులను చంపితే, హిందువుల సంపదను దోచుకెళితే అల్లా కరుణిస్తాడని.. తన భావి తరాలకు ఉగ్రవాదాన్ని ప్రబోధించాడు తైమూర్. మధ్య యుగ భారతం గురించి చరిత్రను చదివితే.. తైమూర్ గురించి మరింతగా అర్థం అవుతుంది. 

మరి సైఫ్- కరీనాలకు అంత అవగాహన లేకుండా.. ఒక మతోన్మాది పేరు తమ తనయుడికి పెట్టారా? అని కొంతమంది అడుగుతున్నారు! ఎవరో ఎల్లయ్యో- పుల్లయ్యో తమ పిల్లలకు తైమూర్ పేరు పెట్టుకున్నా, ఒసమా బిన్ లాడెన్ పేరు పెట్టుకున్నా.. పెద్దగా ఇష్యూ కాదు కానీ, ఒక సెలబ్రిటీ తనయుడికి మాత్రం ఇలాంటి పేరు చిత్రమైనదే. ముందు ముందు ఈ తైమూర్ కూడా సినీ హీరోనే కావొచ్చు. ఇతడి పేరు వచ్చినప్పుడల్లా.. సామాన్య జనాలకు మతోన్మాద మధ్యయుగం చక్రవర్తి గుర్తొస్తాడేమో!

Show comments